జాబ్ కార్నర్: యూపీఎస్సీలో ఉద్యోగాలు.. 414 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 414 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 3, 2018.

సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్
ఖాళీల సంఖ్య: 414
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 3 సెప్టెంబర్, 2018

UPSC recruitment 2018 apply for 414 Combined Defence Service Post

విద్యార్హతలు
* IMA అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

* ఎయిర్ ఫోర్స్ అకాడెమీ: ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీ

* ఇండియన్ నేవల్ అకాడెమీ: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు:
IMA: అవివాహితులైన పురుషులు 2 జూలై 1995 నుంచి 1 జూలై,2000 మధ్య జన్మించి ఉండాలి

ఇండియన్ నేవల్ అకాడెమీ: అవివాహితులైన పురుషులు 2 జూలై 1995 నుంచి 1 జూలై,2000 మధ్య జన్మించి ఉండాలి

ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ: 1 జూలై, 2019 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

అప్లికేషన్ రుసుము: మహిళలకు/ఎస్సీ/ఎస్టీలకు ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ.200/-

ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 8 ఆగష్టు,2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 3 సెప్టెంబర్,2018
రాత పరీక్ష: 18 నవంబర్,2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/1Uy87R

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+