షాకింగ్: మొటిమలతో అప్‌సెటై యువతి ఆత్మహత్య

ఇండోర్: మొటిమల సమస్య కారణంగా ఓ 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది. చిన్నపాటి సమస్య కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. మొటిమల సమస్య కారణంగా యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గాయత్రి నగర్ ప్రాంతానికి చెందిన నిధి మాల్వియా అక్టోబర్ 11వ తేదీన విషం తాగింది. అనంతరం ఆమెకు అదే పనిగా వాంతులు అయ్యాయి. ఆమెకు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె ఆదివారం రాత్రి కన్నుమూసిందని పోలీసులు తెలిపారు.

తన ముఖం పైన ఉన్న మొటిమల కారణంగా ఆమె తీవ్రంగా అప్ సెట్ అయ్యిందని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.

Upset over acne problem, woman commits suicide

పిల్లల్ని ఎండలో నిలబెట్టారు

హైదరాబాదు సమీపంలోని ఘట్‌కేసర్‌లోని ఓ పాఠశాలలో సమయానికి ఫీజు కట్టలేదని ఎల్కేజీ విద్యార్థులను యాజమాన్యం ఎండలో నిలబెట్టింది. చాలాసేపు అలాగే నిలబడడంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలపై కర్కశంగా ప్రవర్తించిన యాజమాన్యం తీరును తప్పుబడుతూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

మహారాష్ట్ర అధికారి 53 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ

మనీలాండరింగ్‌ ఆరోపణలపై సస్పెండైన మహారాష్ట్ర డిప్యూటీ కలెక్టర్‌ నితీశ్‌ ఠాకూర్‌కు చెందిన రూ.53.57కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సదరు కేసుకు అటాచ్‌ చేసింది. ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈ ఉత్తర్వులిచ్చినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

రోగి కడుపులో ఇనుప వస్తువులు

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఒక రోగి కుడుపులోంచి పలురకాల వస్తువులు బయటపడ్డాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన రమేష్‌ హమాలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సుమారు పదేళ్ల క్రితం మానసిక వ్యథకు గురై ఇంట్లో ఉంటున్నాడు. ఇతడి భార్య భాగ్య కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

కాగా, రమేష్‌కు కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసి అతని కడుపులోంచి పెన్నులు, పెన్సిళ్లు, కట్టెపుల్లలు, సైకిల్‌ పుల్లలు, నట్టు బోలోట్లు, ప్లాస్టిక్‌, తదితర సుమారు 40 వస్తువులను బయటికి తీశారు. ప్రస్తుతం అతని ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+