భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్నాడు!

Upset over having only two daughters and no son,angry Bihar man bobbitises himself
పాట్నా: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి(30) తీవ్ర అసహనానికి గురై పదునైనా కత్తితో తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడికి ఇద్దరు కూతుళ్లున్నారు.

కొడుకు మాత్రం పుట్టలేదు. ఇదే విషయంపై అతడికి, అతని భార్యకు తరచూ గొడవ జరుగుతుండేది. గురువారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు.

తీవ్ర వాగ్వాదం అనంతరం ఆగ్రహానికి, అసహనానికి గురైన అతడు తన పురుషాంగాన్ని పదునైన కత్తితో కోసేసుకున్నాడు. దీంతో వెంటనే అతడ్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు అతని బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు, నెల రోజులపాటు సెలవుపెట్టి ఇటీవలే తన స్వస్థలం బీహార్ రాష్ట్రానికి వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+