Urfi Javed: నా ఫొటో పోర్న్ వెబ్‍సైట్‍లో పెట్టారు: ఉర్ఫీ జావేద్
ఉర్ఫీ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 సంవత్సరాల వయస్సులో తన ఫొటో ఎవరో పోర్న్ వెబ్ సైట్ లో పెట్టడంతో తనను ఇంట్లో ఘోరంగా కొట్టారని తెలిపింది. ఉర్ఫీ జావేద్ బిగ్ బాస్ తర్వాత టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళగా ఉన్నారు. ఉర్ఫీ జావేద్ 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోవాలనే తన నిర్ణయం గురించి చెప్పారు.
ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో కూడా వివరించారు. "నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు నా చిత్రాన్ని ఎవరో పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అది సాధారణ చిత్రమే.. ట్యూబ్ టాప్ వేసుకుని ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటోగా అప్‌లోడ్ చేశాను.. ఎవరో వాటిని డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్ లేకుండా పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. మెల్లగా అందరికి విషయం తెలిసింది. అందరూ నన్ను చాలా దూషించడం మొదలుపెట్టారు. నేను పోర్న్ స్టార్ అని అన్నారు" అని ఆమె చెప్పింది.

తాను 17 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయినట్లు ఉర్ఫీ చెప్పారు. ఆమె సోదరీమణులతో కలిసి ఇల్లు వదిలి లక్నోకు వెళ్లారు. ఆమె అక్కడ పిల్లలకు ట్యూటరింగ్ చెప్పి అద్దె చెల్లించేది. తరువాత ఢిల్లీకి వెళ్లి అక్కడ ఆమె కొంతకాలం ఒక స్నేహితుడి ఫ్లాట్ ఉన్నారు. తర్వాత కాల్ సెంటర్ ఉద్యోగం చేశారు. ఆమె ముంబైకి వెళ్లి పీజీలో ఉండి యాక్టింగ్ ఆవకాశాల కోసం ప్రయత్నించారు. చివరికి ఆమెకు టెలివిజన్‌లో చిన్న పని దొరికింది. ఆమె ఇప్పుడు అజియో, అబు జానీ, సందీప్ ఖోస్లా వంటి బ్రాండ్‌లతో కలిసి పని చేస్తున్నారు. ఆమె ఇటీవల OTT ప్లే చేంజ్‌మేకర్స్ అవార్డ్స్ కూడా వచ్చింది.












Click it and Unblock the Notifications