వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరికి కౌంటర్‌గా పీవోలోకి..: కొట్టిపారేసిన ఆర్మీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లో యూరి ఉగ్రదాడికి కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ఎల్వోసీని దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో అడుగు పెట్టి ఇరవై మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిందన్న వార్తల పైన సైన్యం స్పందించిందని తెలుస్తోంది. ఆ వార్త ఇచ్చిన వెబ్‌సైట్ అదే మాటకు కట్టుబడి ఉంది.

అదే సమయంలో సైన్యం మాత్రం ఖండిస్తోంది. అలాంటి ఆపరేషన్ ఏదీ చేయలేదని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి.

వన్ ఇండియాకు ఇచ్చిన సమాచారం మేరకు.. అలాంటి ఆపరేషన్ ఏదీ జరగలేదు. సెప్టెంబర్ 20-21వ తేదీ మధ్య అలాంటి ఆపరేషన్ జరిగినట్లు వచ్చింది. కానీ సరిహద్దుల్లో అలాంటిదేమీ లేదని చెప్పారు.

ఎల్వోసీని దాటి 20 మంది తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం?ఎల్వోసీని దాటి 20 మంది తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం?

Uri Avenged with Special Op? Army, govt.sources rubbish story

ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు కూడా దీనిని కొట్టి పారేస్తున్నాయి. అలాంటి విషయం తమకు ఏదీ తెలియదని ఆ వర్గాలు చెప్పాయి.

ఆ వెబ్ సైట్లో వచ్చిన వార్తల మేరకు.. మన సైన్యం ఎల్వోసీని దాటి పీవోకేలోకి వెళ్లి ఇరవై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘనటలో 200 మంది వరకు గాయపడ్డారు. ఇది యూరి ఉగ్రదాడికి పాకిస్తాన్‌కు కౌంటర్‌గా అభిప్రాయపడింది.

కాగా, సోషల్ మీడియా దీని పైన చర్చ జరిగింది. ఈ విషయాల గురించి బాగా తెలిసిన జర్నలిస్టులు, ఈ వార్తలను కవర్ చేసే వారు కూడా అలాంటి ఆపరేషన్ తెలియదని చెబుతున్నారు.

నేషనల్ సెక్యూరిటీ ఎనలైస్ట్ నితిన్ గోఖలే తన ట్విట్టర్ అకౌంటులో.. అలాంటి ఆపరేషన్ ఏదీ జరగలేదని ఆర్మీ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన మరో ట్వీట్ కూడా చేశారు. ఒకవేళ అదే నిజమైతే, అంత సులభమైతే... ఇన్నేళ్లుగా ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించారు.

English summary
Army and government sources have rubbished the sensational story that appeared on a website stating that the Indian army had carried out an operation across the Line of Control in Kashmir and killed 20 Pakistani terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X