మహారాష్ట్ర మండలికి ఊర్మిళ..? అభ్యర్థిత్వంపై ఉద్దవ్ ఎస్.. ప్రకటించడమే తరువాయి.. ఒక్కో పార్టీ నుంచి..
మహారాష్ట్ర ప్రభుత్వం 12 మందికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించనుంది. ఇక్కడ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కో పార్టీ నుంచి నలుగురికి అవకాశం ఇస్తారు. అయితే అందులో ఊర్మిళ మంటోడ్కర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి, ముఖ్యనేత సంజయ్ రౌత్ తెలిపారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో 12 మందిపై నిర్ణయించింది. అభ్యర్థుల వివరాలు సీఎం వద్ద ఉన్నాయని.. ఆయన నిర్ణయం మేరకు గవర్నర్ మండలికి 12 మంది అభ్యర్థులను నియమిస్తారని వివరించారు. నటి ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబై నార్త్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అయితే ఓడిపోవడంతో.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. వారు సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయానని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడారు.

అయితే ఇటీవల ముంబైని పీవోకే అని కంగనా రనౌత్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఊర్మిళ బాహాటంగా వ్యతిరేకించారు. దీంతో శివసేనకు దగ్గరయ్యారు. అందుకే ఉద్దవ్ థాకరే.. తన పార్టీ నుంచి నలుగురిలో ఊర్మిళకు అవకాశం ఇచ్చి ఉంటారు. సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సామాజిక సేవ చేసిన వారిని మండలికి నామినేట్ చేస్తారు. 12 మందిలో ఊర్మిళతోపాటు ఆదాశ్ భండేకర్, ఆనంద్ షిండే, ఎన్సీపీ నేత ఏఖ్‌నాథ్ షిండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications