ఇలా చేస్తారా?: టీసీఎస్, ఇన్పోసిస్, కాగ్నిజెంట్లపై అమెరికా ఆగ్రహం

ప్రముఖ భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీగా హెచ్1బీ వీసాల దరఖాస్తులు చేసి లాటరీ విధానంలో ఎక్కువ వీసాలను కైవసం చేసుకుంటున్నాయంటూ టీసీఎస్, ఇన్ఫోసిస్‌లను విమర్శించింది.

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రముఖ భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీగా హెచ్1బీ వీసాల దరఖాస్తులు చేసి లాటరీ విధానంలో ఎక్కువ వీసాలను కైవసం చేసుకుంటున్నాయంటూ టీసీఎస్, ఇన్ఫోసిస్‌లను విమర్శించింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ హెచ్1బీ వీసాల అంశంపై గత వారం నిర్వహించిన సమావేశంలో ఓ అమెరికా అధికారి భారత ఐటీ కంపెనీలపై తీవ్రంగా స్పందించారు.

భారీగా ధరఖాస్తులు చేసి..

భారీగా ధరఖాస్తులు చేసి..

‘కొన్ని భారత ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నాయి. దీని వల్ల సహజంగానే లాటరీ డ్రాలో ఎంపిక అవకాశాలు పెరుగుతాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు వాస్తవంగా పొందే సంఖ్య కన్నా భారీగా వీసాల కోసం పంపుతున్నాయి. అదనంగా దరఖాస్తులను పంపడం ద్వారా లాటరీ విధానంలో ఎక్కువ మొత్తంలో వీసాలను అవే సంస్థలు సొంతం చేసుకుంటున్నాయి' అని సదరు అధికారి మండిపడ్డారు.

భారత ఐటీ కంపెనీలనే ఎందుకంటే..

భారత ఐటీ కంపెనీలనే ఎందుకంటే..

కాగా, భారత ఐటీ కంపెనీలనే ఎందుకు ప్రస్తావించడమని ప్రశ్నించగా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్.. అధిక హెచ్1బీ వీసాలను పొందుతున్న తొలి 3 కంపెనీలని ఆయన వివరించారు. కాగా, ఈ మూడు కంపెనీల్లో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఏడాదికి సగటున వేతనం 60వేల నుంచి 65వేల డాలర్ల మధ్య ఉంది. అదే సగటు సిలికాన్ వ్యాలీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేతనం లక్షా50వేల డాలర్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా..

నిబంధనలకు విరుద్ధంగా..

కార్మిక శాఖ నిర్దేశించిన వేతనాలకు అనుగుణంగా కేవలం 56శాతం హెచ్1బీ వీసా హోల్డర్లే వేతనాలను పొందుతున్నారని చెప్పారు. అమెరికాలో ఉద్యోగుల స్థానంలో నియమించుకునేందుకు గానూ తక్కువ వేతనాలకే బయటి నుంచి ఉద్యోగులను తీసుకొస్తున్నారని చెప్పారు. ఇలా తీసుకొచ్చే ఉద్యోగులు తక్కు వ నైపుణ్యలున్నవారేనని, నిజానికి నిపుణులైన కార్మికులకు ఉద్దేశించిన వీసాల కార్యక్రమానికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు.

ఇక కష్టమే..

ఇక కష్టమే..

ప్రస్తుత విధానంలో వీసాలను నైపుణ్యాలు, వేతనాలతో సంబంధం లేకుండా లాటరీ విధానంలో ఎంపిక చేస్తుండగా, దీన్ని మార్పు చేసినట్లు వివరించారు. దీంతో అమెరికన్ల ఉద్యోగుల స్థానంలో వీసాల సాయంతో మరొకర్ని భర్తీ చేయడం చాలా కష్ణమన్నారు.
కాగా, నైపుణ్యం కలిగిన మానవ వనరులకే హెచ్1బీ వీసాలను పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+