యూఎస్ ఎంబసీలో దివాలీ వేడుకలు: దిల్బర్ అంటూ అమెరికన్ మహిళల డ్యాన్సులు(వీడియో)
న్యూఢిల్లీ: భారతదేశమంతా ఆదివారం రోజున దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కాగా, దీపావళి వేడుకల నేపథ్యంలో భారతీయు వస్త్రాలు ధరించి ఆడుతూపాడుతూ సంబరాలను చేసుకున్నారు విదేశీయులు. ఇది ఎక్కడో కాదు మనదేశంలోని అమెరికా రాయబార కార్యాలయంలో.
దీపావళి వేడుకలు
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో శనివారం నుంచే దీపావళి వేడుకలు మొదలయ్యాయి. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. ఈ కార్యాలయంలో జరిగిన వేడుకల వీడియోను ట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వారికి భారతీయులు ధన్యవాదాలు చెబుతూ శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.
వేడుకలు ఇలా..
కాగా, ఈ వీడియోలో బాలీవుడ్ సినిమాలోని ఓ పాటకు విదేశీ మహిళలంతా మన సాంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా నృత్యాలు చేశారు. సత్యమేవ జయతే సినిమాలోని ‘దిల్‌బర్' పాటకి కార్యాలయంలోని మహిళా సిబ్బంది కాలుకదిపారు. పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు.
ఉత్సాహపరిచారు..
అక్కడున్నవారు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ వారిని ఉత్సహపర్చారు. భారతీయులంతా దీపావళి పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అమెరికా రాయబార కార్యాలయం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.
నృత్యాలు భళా అంటూ..
దీపావళి సందర్భంగా అమెరికా కార్యాలయ సిబ్బంది మన సాంప్రదాయాలను, పండగలను గౌరవిస్తూ ఇలా చేయడంపై నెటిజన్లు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ నృత్యాలు భారతీయులను ఎంతో ఆకట్టుకున్నాయంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications