బుర్ఖా ధరించి డాక్టరుపై నోరుపారేసుకున్న విదేశీ మహిళ..అసలేం జరిగింది..?
పూణే: బుర్ఖా ధరించిన మహిళా డాక్టర్‌పై అమెరికాకు చెందిన మహిళ దూషించిన ఆరోపణల మీద ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. అయితే అమెరికాకు చెందిన ఈ 43 ఏళ్ల మహిళ మానసిక వ్యాధితో బాధపడుతోందని ఇందుకోసం చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. బుర్ఖా ధరించిన 27 ఏళ్ల డాక్టరును అమెరికా మహిళ దూషించడంతో డాక్టరు ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూణేలోని క్లవర్ సెంటర్ మార్కెట్‌లో వీరిద్దరూ షాపింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
ముందుగా డాక్టర్ మతం గురించి అమెరికా మహిళ అడిగిందని పోలీసులు చెప్పారు. అవును తాను ముస్లింనేనని చెప్పగానే డాక్టరుపై దూషణల పర్వంకు తెరదీసిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పిన ఖాకీలు.... పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్న సమయంలో వారిపైన కూడా తిట్ల పురాణం అందుకుందని చెప్పారు. తను ఏ దేశానికి చెందినదో చెప్పాలంటూ పోలీసులు ప్రశ్నించగా వారిపై విరుచుకుపడిందని చెప్పారు. ఇదిలా ఉంటే పూణేలోని కొంద్వా ప్రాంతంలో ఓ ముస్లిం వ్యక్తితో ఈ అమెరికా మహిల కలిసి ఉంటోందని తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

అమెరికా మహిళను అదుపులోకి తీసుకుని ఆమెపై సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాదు అంతర్జాతీయ అవమానం, శాంతికి విఘాతం కల్గించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్ 504 కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా మహిళ దూషణలను గుర్తించలేని నేరంగా పరిగణలోకి తీసుకుని ఆ చట్టం కింద అంటే ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ ప్రారంభించాలంటే ముందుగా అరెస్టు వారెంట్ కలిగి ఉండాలని అదే సమయంలో విచారణ చేసేందుకు కోర్టు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
-
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..! -
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..! -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?












Click it and Unblock the Notifications