Yogi Adityanath: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందాలి: యోగి ఆదిత్యనాథ్
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వెనకబడిన తరగతులకు అందాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం యోగి గోరఖ్‌నాథ్ ఆలయంలో జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి సమస్య సత్వరమే, పారదర్శకంగా సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

350 మంది
సుమారు 350 మంది జనతా దర్శన్‌కు హాజరై తమ సమస్యలను సీఎంతో చెప్పుకున్నారు. అనంతరం ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యం కోసం ఆర్థిక సహాయం కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వారి చికిత్సకు పూర్తి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు.

వైద్య చికిత్స
డబ్బు లేక ఏ ఒక్క వ్యక్తి చికిత్స ఆగకూడదని యోగి స్పష్టం చేశారు.వైద్య ఖర్చుల అంచనా ప్రక్రియను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా వెంటనే నిధులు అందుతాయని చెప్పారు. గురు గోరఖ్‌నాథ్‌కు ప్రార్థనలు చేసి, ఆయన గురుదేవ్ బ్రహ్మలిన్ మహంత్ వైద్యనాథ్ 'సమాధి' వద్ద నివాళులర్పించారు. తర్వాత సీఎం గౌశాలలో కాసేపు గడిపారు. పశువులకు బెల్లం, శనగలు తినిపించారు.

150 ఐటీఐలు
అటు యువతలో నైపణ్యం పెంచడానికి యూపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా యూపీలోనిని 150 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్‌తో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో యూపీలోని స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కొత్త శకానికి నాంది పలుకుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యువత నైపుణ్యం మాత్రమే కాకుండా ఆధునిక పరిశ్రమ డిమాండ్‌లకు సరిపోయేలా ఉండాలని చెప్పారు.

నైపుణ్యాలు
ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని యువత నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా టాటా టెక్నాలజీస్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కూడా సహాయపడుతుందని ఆదిత్యనాథ్ అన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలతో యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో, సాంకేతిక స్థాయిలో విస్తృతమైన మార్పులు వచ్చాయన్నారు. కానీ రాష్ట్రంలోని ఐటీఐలు అప్‌గ్రేడ్ కాలేదని.. మనం కొత్త సాంకేతికతకు అనుగుణంగా లేకపోతే ఖచ్చితంగా వెనుకబడి ఉంటామని తెలిపారు.

35,000 మంది యువత
కాలంతో పాటు కొత్త టెక్నాలజీకి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలలో కూడా చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌తో ఈరోజు రూ. 5,472 కోట్ల MoAపై సంతకం చేసిందని చెప్పారు. తమ ఐటీఐల ప్రయోగశాలలు, పరికరాలను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని ఐటీఐలకు టాటా టెక్నాలజీస్ నుంచి మంచి శిక్షకులు కూడా అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో ఏటా 35,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు టాటాతోపాటు విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉద్యోగాలు పొందగలుగుతారని యోగి ఆధిత్యనాథ్ పేర్కొన్నారు.

వారెన్ హారిస్
ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ కావడంతో ఇక్కడి యువతను ఈ రంగంలో మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే తమ దృష్టి ఉందని టాటా టెక్నాలజీస్ సీఈఓ వారెన్ హారిస్ అన్నారు. ఈ ఒప్పంద ప్రకారం UPలో 150 ITIలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు ఈ ఐటీఐలలో మా సంస్థ తరపున 11 కొత్త యుగం లాంగ్ టర్మ్ ట్రేడ్‌లు, 23 కొత్త షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహిస్తామని, ఇక్కడి యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధితో అనుసంధానం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications