నెట్ లో ప్రేమజంట అశ్లీల వీడియో, బహిష్కరణ

ఆగ్రా: ప్రేమ జంట ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియో తీసి గ్రామం మొత్తం చాక్లెట్లు పంచినట్లు సీడీలు పంచిపెట్టారు. అవమానంతో ప్రేమ జంట కుంగిపోయారు. గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి యువ జంటను గ్రామం నుండి బహిష్కరించారు.

అగ్రా సమీపంలోని నాయికీ మండీ అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది. నాయికీ మండీలో నివాసం ఉంటున్న శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు, అదే గ్రామంలో నివాసం ఉంటున్న పేదింటి యువతి ప్రేమించుకున్నారు.

ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరు ఒక రోజు ఏకాంతంగా గడిపారు. ఆ సందర్బంలో ఒక యువకుడు వారిద్దరు కలిసి ఉన్న దృశ్యాలను వీడియో తీశాడు. తరువాత ఆగ్రాకు వెళ్లి ఒక సీడీ షాప్ లో వందల సీడీలు ప్రింట్లు వేయించాడు.

తరువాత గ్రామంలో నివాసం ఉంటున్న వారికి సీడీలు చేరే విధంగా ఏర్పాట్లు చేశాడు. అంతే కాకుండ ఆ దృశ్యాలను ఇంటర్నెట్ లో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. మీరు గ్రామం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Uttar Pradesh couple's home sex video goes viral on Internet

అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులను ఊరందరి ముందు అవమానించి, మందలించి వదిలేశారు. ప్రేమ జంటను గ్రామం నుండి బహిష్కరించారు. 10 రోజులలో ఊరు వదిలి వెళ్లి పోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవమానంతో యువకుడు ఇప్పటికే ఊరు విడిచి వెళ్లి పోయాడు. యువకుడి పిలుపుకోసం యువతి వేచి ఉంది.

విషయం తెలుసుకున్న పోలీసులు స్వచ్చందంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి చెల్లి వెంట అదే గ్రామంలో నివాసం ఉంటున్న ఇంకో వ్యక్తి వెంటపడుతున్నాడు. అయితే అమె దక్కక పోవడంతో వారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నాడు.

అతనే ప్రేమ జంట ఒంటరిగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియో తీసి సీడీలు వేయించి పంచిపెట్టాడని, ఇంటర్నెట్ లో పోస్టు చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. పరారైన ఆ కీచకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+