అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా! ‘చాణక్య’ అంచనాలను నిజం చేసిన బీజేపీ
తాజాగా జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టూడేస్ ‘చాణక్య’ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. మిగితా ఛానళ్లు, వార్తా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్
లక్నో: గత కొంత కాలం క్రితం న్యూస్ ఛానళ్లు, వార్తా సంస్థలు ఎన్నికల ఫలితాల కంటే ముందు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండేవి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో విఫలమవుతున్నాయా? లేక ప్రజలే అంచనాలకు అందకుండా ఉన్నారా? అనేది తెలియడం లేదు.
అయితే, తాజాగా జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టూడేస్ 'చాణక్య' వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. మిగితా ఛానళ్లు, వార్తా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్‌కు వాస్తవ ఫలితాలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం.
ఎగ్జిట్‌పోల్స్‌లో దాదాపుగా అన్ని సంస్థలు యూపీలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఊహించాయి. అయితే మెజార్టీకి దగ్గర్లోకి వచ్చి ఆగుతుందని, ఎక్కువ స్థానాలు సాధించిన పెద్దపార్టీగా అవతరిస్తుందని సర్వేలు పేర్కొన్నాయి.

అయితే న్యూస్ 24- టుడేస్ చాణక్య సంయుక్తంగా నిర్వహించిన సర్వేల్లో మాత్రం యూపీలో బీజేపీ ప్రభంజనాన్ని ముందే చెప్పడం గమనార్హం. వీరి సర్వేలో బీజేపీ 285, ఎస్పీ కూటమి 88, బీఎస్పీ 27 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశారు. 285 అంతకంటే ఎక్కువగా 18 స్థానాలు రావచ్చని చాణక్య వెల్లడించింది. కాగా, వాస్తవ ఫలితాలు కూడా అంతే దగ్గరకు రావడం విశేషం.
బీజేపీ వీరి అంచనాలను నిజం చేస్తూ.. 310 పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాగా, ఇండియా టీవీ-సీఓటరు బీజేపికి 155-167 స్థానాల మధ్యలో, ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా 251-279 మధ్య, న్యూస్‌ఎక్స్-ఎంఆర్‌సీ 185, ఏబీపీ న్యూస్-సీఎస్‌డీఎస్ 164-176 మధ్య, టైమ్స్ నౌ- వీఎంఆర్ 190-210 మధ్య, జీ న్యూస్ 219 స్థానాలు వస్తాయని తమ తమ సర్వేల్లో వెల్లడించాయి.
#TCExitPoll All India Tally (543 seats) #BJP 291 ± 14 Seats#Cong 57 ± 9 Seats#NDA 340 ±14 Seats#UPA 70 ±9 Seats
— Today's Chanakya (@TodaysChanakya) May 12, 2014
Others 133 ±11 Seats
వీటన్నింటికంటే టూడేస్ చాణక్య అంచనాలు వాస్తవిక ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా చాణక్య ఇలాగే వాస్తవిక ఫలితాలకు చాలా దగ్గరగా తన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం విశేషం.












Click it and Unblock the Notifications