సినిమాలోలా: నచ్చిన వ్యక్తితో భార్యకు పెళ్లి చేశాడు

లక్నో: ఇష్టంలేని పెళ్లి చేసుకున్న తన భార్యకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించి ఓ వ్యక్తి ఆదర్శంగా నిలిచాడు. వివాహమయ్యాక భార్య మరో వ్యక్తితో కలిసి తిరుగుతోందని భర్తకు తెలిసిన మరు క్షణం ఎలాంటి దారుణాలకైనా పాల్పడే ఈ రోజుల్లో.. అతను చేసిన ఈ పని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది.

సినిమాను తలపించిన ఈ ఘటన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కి చెందిన చందా అనే యువతి అదే ప్రాంతానికి చెందిన సూరజ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, పెద్దల మాటలకు అడ్డుచెప్పలేక చందా అదే ప్రాంతానికి చెందిన ఫూల్ చంద్ అనే వ్యక్తిని వివాహమాడింది.

 Uttar Pradesh husband helps wife marry lover, sees her off with gifts

వివాహమైన కొద్ది రోజుల అనంతరం ఫూల్‌ చంద్ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికీ చందా తాను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక రోజూ కలుస్తూనే ఉండేది. భర్త ఫూల్ చంద్ కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పుడు చందా తన భర్త తనకు కానుకగా ఇచ్చిన కానుకలను తిరిగి ఇచ్చేసి తన ప్రేమ విషయాన్ని వివరించింది.

ముందు ఫూల్ చంద్ కోపగించినా.. ఆ తర్వాత ఆలోచించి వారిద్దరినీ ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం ఇరువైపుల పెద్దలతో పాటు ఊరి పెద్దల్ని ఒప్పించి గురువారం చందా, సూరజ్‌ల వివాహం జరిపించాడు. అంతేగాక, నూతన దంపతులకు కానుకలిచ్చి దగ్గరుండి కాపురానికి పంపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+