యూపీ: అమ్మాయిల టైట్ జీన్స్, టీషర్ట్స్‌పై నిషేధం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లోని పంచాయతీలు ఇస్తున్న తీర్పులు, కట్టుబాట్లు కలకలం రేపుతున్నాయి. యూపీలోని కొన్ని జిల్లాల్లో న్యాయస్థానాల్లా భావించే పంచాయతీల్లో యువతుల కట్టూబొట్టుపై విధిస్తున్న ఆంక్షలు వివాదాలకు దారితీస్తున్నాయి.
భాగ్‌పత్ గ్రామ పంచాయతీ పెద్దలు మహిళల వస్త్ర ధారణపై ఆంక్షలు విధించారు. టైట్ జీన్స్, లెగ్గింగ్స్, టీషర్ట్స్, బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించకూడదని తీర్పు ఇచ్చారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను రక్షించేందుకు ఈ తీర్పు ఇచ్చామని గ్రామపెద్దలు ప్రకటించారు. తమ తీర్పును కాదని, ఎవరైనా అమ్మాయి టైట్ జీన్స్, టీ షర్ట్స్, లెగ్గింగ్స్ లాంటివి వేసుకుని కనిపిస్తే, వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
అలాగే గ్రామంలో వివాహం చేసుకునే పురుషులు కట్నం తీసుకోరాదని, వివాహ వేడుకల్లో డీజేలు నిర్వహించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కట్టుబాట్లు దాటిన వారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తామని వారు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications