పోలీసులా, మజాకా.. యువకుడిని చితకబాది.. వైరల్ వీడియో

లక్నో : పోలీసులా, మజాకా అనే స్టైల్లో ఖాకీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే నెపంతో తీవ్రంగా కొట్టారు. వాహనదారులపై చేయి చేసుకోవద్దనే నిబంధనలకు తూట్లు పొడిచి మరీ చావగొట్టారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ నగర్ జిల్లాలో గురువారం నాడు పోలీసులు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదారు. రింకీ పాండే అనే యువకుడు చిన్న పిల్లాడితో కలిసి తన బైకుపై వెళుతున్న క్రమంలో ఎస్సై వీరేందర్, హెడ్ కానిస్టేబుల్ మహేందర్ ప్రసాద్ అతడిని ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ పేపర్లు చూపించాలని అడిగారు. ఆ క్రమంలో పోలీసులకు, ఆ యువకుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

uttar pradesh police thrashed Man alleged traffic violation

రింకీ పాండేతో మాట్లాడుతున్న సమయంలో బైక్ తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు పోలీసులు. దాంతో తాళాలు ఇవ్వడానికి సదరు యువకుడు నిరాకరించాడు. ఆ క్రమంలో రెచ్చిపోయిన పోలీసులు అతడిని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. కింద పడేసి కాళ్లతో తన్నారు. కొద్దిసేపు ఆ యువకుడికి నరకమేంటో చూపించారు. ఆ దెబ్బలు తాళలేక.. తాను చేసింది తప్పయితే జైల్లో వేయాలని కోరాడు. అయినా కూడా పోలీసులు కనికరించలేదు.

బైకు తాళాలు లాక్కునే ప్రయత్నంలో ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించిన పాపానికి ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సంబంధింత ఉన్నతాధికారులు స్పందించారు. సదరు యువకుడిని చితకబాదిన ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి డిపార్టుమెంటల్ విచారణకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+