బిజెపి నేత ప్రమోద్ కుమార్ ఎఫెక్ట్: మహిళ పోలీస్ అధికారి శ్రేష్ట ఠాకూర్ బదిలీ
నిబంధలను ఉల్లంఘించిన బిజెపి నేత ప్రమోద్ కుమార్ వాహనాన్ని నడిపినందుకు ప్రశ్నించిన పాపానికి డిప్యూటీ సూపరింటెండ్ శ్రేష్ట ఠాగూర్ పై బదిలీ వేటు పడింది.
మీరట్: నిబంధలను ఉల్లంఘించిన బిజెపి నేత ప్రమోద్ కుమార్ వాహనాన్ని నడిపినందుకు ప్రశ్నించిన పాపానికి డిప్యూటీ సూపరింటెండ్ శ్రేష్ట ఠాగూర్ పై బదిలీ వేటు పడింది. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపావని అడిగిన పాపానికి ఆమెపై బదిలీ వేటేసింది ప్రభుత్వం.
అధికార నేతలతో పెట్టుకొంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడ నిజాయితీగా విధులు నిర్వహించిన శ్రేష్ట ఠాగూర్ ను బహ్ రైచ్ కు బదిలీ చేసింది యూపీ ప్రభుత్వం.

యూపీలో అధికారం తమదేనన్న ధైర్యంతో నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన బిజెపి నేత ప్రమోద్ కుమార్ కు శ్రేష్ట ఠాగూర్ ఇటీవల ముచ్చెమటలు పోయించారు.
ఆయనకు జరిమానాను విధించారు. అయితే తాను బిజెపి నేతనని, తన భార్య బులంద్ కుమార్ జిల్లా పరిషత్ సభ్యురాలని ప్రమోద్ దబాయించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.
ప్రమోద్ ఫోన్ చేయడంతో ఆయన అనుచరులు అక్కడికి చేరుకొని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని ముఖ్యమంత్రితో లెటర్ రాయించుకొని రావాలని, అప్పుడు వదిలేస్తానని శ్రేష్ట తేల్చి చెప్పారు.
అంతేకాదు దురుసుగా వ్యవహరించిన ఐదుగురిపై కేసు నమోదుచేసి జైలుకు కూడ పంపారు. శ్రేష్ట ఠాకూర్ నిజాయితీపై మీడియాలో ప్రశంసలు కూడ వెల్లువెత్తాయి. కాగా, ఠాకూర్ చర్యను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న స్థానిక బిజెపి నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో వారం కూడ తిరక్కుండానే ఠాకూర్ పై బదిలీ వేటేశారు.












Click it and Unblock the Notifications