నో ఇంటర్వ్యూ.. పరుగుపందెంలో గెలిస్తే చాలు.. పోలీస్ ఉద్యోగం మీదే
ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఎటువంటి ఇంటర్వ్యూ,లు నిర్వహించకుండా లక్ష పోలీస్ ఉద్యోగాలు ఇస్తానని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
మెయిన్ పురి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఎటువంటి ఇంటర్వ్యూ,లు నిర్వహించకుండా లక్ష పోలీస్ ఉద్యోగాలు ఇస్తానని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
మూడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెయిన్ పురిలో జరిగిన బహిరంగ సభలో పాల్గన్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే లక్ష పోలీస్ ఉద్యోగాల ప్రకటనను విడుదల చేస్తామని తెలిపారు.
పదో తరగతి, పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన యువతకు పోలీస్ ఉద్యోగాలిస్తామని, ఎలాంటి ఇంటర్వ్యూ, నిర్వహించమని, పరుగు పందెలో సామర్థ్యం చూపిస్తే చాలు.. ఉద్యోగం వచ్చినట్లేనని అఖిలేష్ హామీ ఇచ్చారు.

సమాజ్ వాదీ పార్టీ నిర్మించిన రోడ్లను ప్రజలు 200-400 ఏళ్లపాటు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. తన ఆలోచనల్లో ఎలాంటి గందరగోళం లేదని, సమాజ్ వాదీ పార్టీ ఎప్పటికీ నేతాజీ (ములాయం సింగ్ యాదవ్)దేనని అఖిలేష్ ఉద్ఘాటించారు.
రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజమేనంటూ.. కొందరు తనకు కఠినమైన పరీక్ష పెట్టారని, దాని వల్ల వారికేం ఒరుగుతుందో తెలియదని, ఇటీవలి పార్టీ సంక్షోభ సమయంలో తన వెంట కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications