Viral Video:పెళ్లి కొడుకుకు షాక్.. దండ వేయమంటే చెంపచల్ మనిపించింది.. ఎక్కడ అంటే..?
పిచ్చో.. మరెంటో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల విచిత్ర ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పెళ్లి సమయంలో.. అంతకుముందు జరిగే వేడుకలో ఇబ్బందికర సిచుయేషన్స్ ఎదురవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌లో ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ అంతా హడావిడి ఉంది. పెళ్లికి ముందు జైమాల వేడుక జరుపుకుంటారు. జైమాల అంటే వరుడు, వధువు కలిసి దండలు మార్చుకోవడమే.. దానిని అక్కడ వేడుకగా చేసుకుంటారు. ఇటీవల ఓ వరుడి జైమాల సెలబ్రేషన్ జరిగింది. కానీ అతనికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఏం జరిగిందంటే..
జైమాల వేడుకలో అంతా ఉన్నారు. ఇంతలో అక్కడికి వధువు వచ్చింది. కానీ వరుడి మెడలో దండ వేయలేదు. అతని చెంప్ చెల్ మనిపించింది. ఒక్కసారి కాదు రెండుసార్లు ఇంకేముంది.. ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతయిపోయింది. ఏంటీ అమ్మాయి ఇలా చేసిందని ప్రతీ ఒక్కరు అలానే ఉండిపోయారు. కాసేపు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారు. అమ్మాయి ఎందుకిలా చేసింది కాసేపటి వరకు అర్థం కాలేదు.
నచ్చలేదట.. అయితే
విషయం తర్వాత తెలిసింది. ఎందుకు వరుడిని కొట్టావని అంటే.. వరుడు అంటే ఇష్టం లేదట.. నచ్చకుంటే చేసుకోకుండా ఉండాల్సింది.. మరీ కొట్టడం దేనికి అని కొందరు గుణుక్కుంటున్నారు. అంతేకాదు పెళ్లి అంటే కూడా ఇష్టం లేదట.. ఇదే విషయాన్ని సదరు యువతి పేరంట్స్‌కి చెబితే సరిపోయేది.
కానీ అలా చేయక.. దాడి చేయడంతో వివాదమైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. ఏంటీ ఇదీ.. పెళ్లికి ముందే.. ఇలా బహిరంగంగా కొడతారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కొట్టి.. వెళ్లిపోయింది.. తర్వాత
జైమాల వేడుక అలా జరుగుతుండగానే యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొత్త జంటకు అంతా కంగ్రాట్స్ అని చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే అప్పటికే ఆమె చీర కట్టుకొని.. అందంగా తయారై వచ్చింది. కానీ అంతలో వెళ్లిపోవడంతో.. ఫ్యామిలీ మెంబర్స్ షాక్‌నకు గురయ్యారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయి.
ఒకరికొకరు పరస్పరం ఒప్పందం చేసుకొన్నాక.. తిరిగి వివాహ తంతు జరిగింది. కానీ ఆ ఘటనను మాత్రం ఎవరూ మరవలేదు. వరుడు మాత్రం తెగ ఇబ్బంది పడ్డాడు. అప్పుడే అలా ఉంటే.. తన పరిస్థితి ఏంటీ అనుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications