వెంటపడి తాకేందుకు ప్రయత్నించాడు: చికతబాది బుద్ది చెప్పిన మహిళ

నోయిడా: తనను భౌతికంగా లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి బాధితురాలు తగిన గుణపాఠం చెప్పింది. అతన్ని అందరూ చూస్తుండగానే చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలోని సెక్టార్ 12 పెట్రోల్ పంపు వద్ద చోటు చేసుకుంది.

నోయిడాలోని సెక్టార్ 12 పెట్రోల్ పంపు వద్దకు వెళుతున్న సమయంలో ఆమె వెంటపడ్డాడు ఓ వ్యక్తి. సైకిల్‌పై వచ్చిన అతడు వెంటపడి ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. సహారా రెడ్ లైట్ ప్రాంతానికి చేరుకోగానే ఆమె శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత తన సైకిల్‌పై పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు.

Uttar Pradesh: Woman in Noida chases man, thrashes him for groping her

అయితే, ఆమె మాత్రం అతడ్ని విడిచిపెట్టొద్దని నిర్ణయించుకుంది. ఆ తర్వాత అతడ్ని వెంబడించింది. ఆమెకు సహాయం చేసేందుకు అక్కడున్నవారెవరూ కూడా ముందుకు రాకపోవడం శోచనీయం. అంతేగాక, తమ మొబైల్ ఫోన్లలో ఆ సంఘటనను వీడియోలు తీయడం గమనార్హం. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాను గత ఆరేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నానని, కానీ, తొలిసారి తాను అభద్రతా భావానికి గురైనట్లు బాధితురాలు తెలిపింది. తాను నిందితుడ్ని పట్టుకుని చితకబాదినట్లు పేర్కొంది. దీంతో అతడు తనకు క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. కానీ, ఇలాంటి ఘటనలను అంగీకరించలేమని తెలిపింది. కాగా, ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+