చెల్లి, తల్లిదండ్రుల సహకారంతో యువతిపై రేప్ చేశాడు
లక్నో: 17ఏళ్ల ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, నిందిుతడికి అతని కుటుంబసభ్యులు సహకరించడం విచారకరం. నిందితుడి సోదరి బాధితురాలిని ఇంటికి తీసుకురాగా.. ఇంట్లో కుటుంబసభ్యులు ఉండగానే దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పుర్కాజీ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బాధిత యువతి (17)ని నదీమ్ (25) అనే యువకుడి సోదరి అఫ్సానా వారి ఇంటికి తీసుకెళ్లింది.

ఆ సమయంలో ఆఫ్సానా ఇంట్లో నదీమ్, తల్లిదండ్రులు శార్వరి, ఇక్రామ్, బంధువు కమిల్ ఉన్నారు. వీరందరూ ఉండగానే నదీమ్ బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ అఘాయిత్యాన్ని వీడియో కూడా తీశాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ముజఫర్‌నగర్ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడు నదీమ్‌తో పాటు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.
పరారీలో ఉన్న నదీమ్ కుటుంబసభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఇదే ప్రాంతంలో మరో దారుణం చోటు చేసుకుంది. జాహిద్ (30) అనే వ్యక్తి.. ఓ మహిళపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేశాడు.












Click it and Unblock the Notifications