వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధీర వనిత: రక్షణ కోసం చిరుతతో పోరాడి చంపేసింది

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: చిరుతపులి ఎదురుపడితే ఎవరికైనా చలి చెమటలు పట్టాల్సిందే. దాన్ని చూడటంతోనే తమ ప్రాణాలు కోల్పోయామని చేతులెత్తేస్తాం. అయితే అలాంటి చిరుతపులితో ఓ 56ఏళ్ల పెద్దావిడ వీరోచితంగా పోరాడి దాన్ని చంపేసి తన ప్రాణాలను రక్షించుకుంది. ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా కోడి బోడ్నా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం కమలాదేవి(56) గొడ్డలి, కొడవలితో పొలం పనుల నిమత్తం వెళ్లింది. పొలంలో తన పనిలో తలమునకలైన ఆమె పైకి అక్కడి చేరుకున్న చిరుత పులి ఒక్కసారిగా దాడి చేసింది.

Uttarakhand: Brave woman kills a leopard in self defence

పొలం పని కోసం వెంట తెచ్చుకున్న పని ముట్లే ఆమెకు ఆయుధాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు క్షణాల్లోనే గొడ్డలి, కొడవలితో కమలాదేవి చిరుతపైకి ఎదురుదాడికి దిగింది.

తన వద్ద ఉన్న గొడ్డలి, కొడవలి సాయంతో పులితో సుమారు 30 నిమిషాలపాటు పోరాడిన కమలాదేవి, చివరకు దాన్ని తుదముట్టించింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె శ్రీనగర్ (గర్వాల్) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

English summary
Bringing a brave story from Uttarakhand, a woman killed a leopard in self defence. The 56-year-old woman killed a leopard with a sickle and an axe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X