బీజేపీ మంత్రికి ఫోన్ కాల్: మహిళపై గ్యాంగ్ రేప్‌ను అడ్డుకుంది

ఓ మంత్రికి చేసిన ఫోన్ కాల్ మహిళపై లైంగిక దాడిని అడ్డుకుంది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశ్ పంత్ సత్వరమే స్పందించి ఓ మహిళను గ్యాంగ్ రేప్ నుంచి తప్పించారు.

డెహ్రాడూన్: ఓ మంత్రికి చేసిన ఫోన్ కాల్ మహిళపై లైంగిక దాడిని అడ్డుకుంది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశ్ పంత్ సత్వరమే స్పందించి ఓ మహిళను గ్యాంగ్ రేప్ నుంచి తప్పించారు.

సోమవారం ఆర్టీఐ కేసు విచారణ నిమిత్తం భార్యాభర్తలు ఆదివారం రాత్రి డెహ్రాడూన్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కార్యాలయానికి వచ్చింది. రాత్రి అక్కడే ఉండాలని డైరెక్టరేట్ ఆఫీస్ ఉద్యోగులు వారికి చెప్పారు.

రాత్రి పదకొండు గంటల సమయంలో ఆ దంపతులు తిని, నిద్రపోయేందుకు సిద్ధమయ్యారు. ఆఫీస్ స్టాఫ్ కాల్ చేయగానే మరో ఇద్దరు అక్కడకు వచ్చారు. నలుగురు కలిసి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారు.

Uttarakhand minister helps woman from harassment after getting phone call

వివాహిత ప్రతిఘటించింది. దీంతో వారు దంపతులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళ భర్త వెంటనే ఎమ్మెల్యే, మంత్రి ప్రకాశ్ పంత్‌కు కాల్ చేసి తమను రక్షించాలని కోరాడు. మంత్రి ఎస్ఎస్‌పీ స్వీటీ అగర్వాల్‌కు కాల్ చేసి మహిళపై దురాగతాన్ని అడ్డుకొని నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

సిబ్బంది సహా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కార్యాలయానికి వెళ్లిన అగర్వాల్.. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులలో జగ్మోహన్ సింగ్, అనిల్ రావత్, హరిలు ఉద్యోగుల అని, జగదీష్ సింగ్ అనే టీస్టాల్ నడిపే వ్యక్తి అని పోలీసులు తెలిపారు. బాధితులకు సాయం చేసేందుకు తాను ఎల్లప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+