శభాష్ పోలీస్.. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి సేఫ్..! (వీడియో)
ఉత్తరాఖండ్ : తమ కళ్లేదుట ఎన్నో సంఘటనలు జరుగుతున్నా మనకెందుకులే అని చూస్తూ వెళ్లిపోతున్న రోజులివి. ఆ క్రమంలో ఓ పోలీస్ చూపిన ధైర్యం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. విధినిర్వహణలో ఉన్న సదరు పోలీస్ గంగానదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని క్షేమంగా బతికి బయటపడేటట్లు చేశారు.
హర్యానాకు చెందిన విశాల్.. పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా హరిద్వార్‌కు చేరుకున్నారు. అక్కడ సమీపంలోని గంగానదిలోకి దిగి పవిత్ర స్నానం ఆచరించే క్రమంలో అదుపుతప్పాడు. ఆయనకు ఈత రాని కారణంగా అలా నదిలో కొట్టుకుపోతున్నాడు. అది గమనించిన ఓ పోలీస్ అతడిని కాపాడేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. అయినా కూడా అతడు బెదరలేదు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

हरियाणा निवासी विशाल #haridwar स्थित कांगड़ा घाट पर नहाने गया था। तभी उसका पैर फिसला और वह गंगा के तेज बहाव में बहने लगा है। इसी दौरान वहां मौजूद #UttarakhandPolice के जवान #सन्नी की नजर उस पर पड़ी। सन्नी ने तत्काल गंगा में कूदकर युवक को कड़ी मशक्कत के बाद सकुशल बचा लिया। pic.twitter.com/g1qhBYKhlF
— Uttarakhand Police (@uttarakhandcops) July 20, 2019
విశాల్ నదిలో కొట్టుకుపోతుండటంతో సదరు పోలీస్ ఏమీ ఆలోచించలేదు. వెంటనే లైఫ్ జాకెట్ ధరించి నదిలోకి దూకారు. అతడి దగ్గరకు చేరుకుని క్రమంగా ఒడ్డుకు చేర్చాడు. అలా పోలీస్ ధైర్యసాహసాలతో విశాల్ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శభాష్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడి ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications