Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓడినప్పటికీ మరో ఛాన్స్: ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరో సారి పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండవ సారి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పుష్కర్ సింగ్ ధామితో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం అభ్యర్థి యోగీ ఆదిత్యనాథ్‌లు హాజరయ్యారు.

Uttarakhand:Pushkar singh Dhami swearing in ceremony live updates in telugu

గత నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. బీజేపీ 46 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే పుష్కర్ సింగ్ ధామి మాత్రం తాను పోటీ చేసిన ఖతిమా నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత భువన్ చంద్ర కాప్రి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ బీజేపీ హైకమాండ్ మరోసారి ధామికి సీఎం అయ్యే అవకాశం కల్పించింది. పుష్కర్ సింగ్ ధామి సీఎంగా ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్‌ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Mar 23, 2022, 2:39 pm IST

ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం. ధామితో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ గుర్మీత్ సింగ్
Mar 23, 2022, 2:35 pm IST

పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ
Mar 23, 2022, 2:30 pm IST

ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గోవా సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్
Mar 23, 2022, 2:29 pm IST

ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇతర బీజేపీ అధినాయకులు
Mar 23, 2022, 2:07 pm IST

ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Mar 23, 2022, 12:39 pm IST

పుష్కర్ సింగ్ ధామితో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించనున్న గవర్నర్ గుర్మీత్ సింగ్
Mar 23, 2022, 12:23 pm IST

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు డెహ్రాడూన్‌లోని తాపకేశ్వర్ మహదేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి
Mar 23, 2022, 9:13 am IST

నేడు ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం
Mar 23, 2022, 8:10 am IST
ఉత్తరాఖండ్

డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు పుష్కర్ సింగ్ ధామీ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Mar 23, 2022, 7:36 am IST
ఉత్తరాఖండ్

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న పుష్కర్ సింగ్ ధామి.. ఆరు నెలల్లోగా చట్టసభల్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాదు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఖతిమా నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కాప్రి చేతిలో ఓటమిపాలయ్యారు.
Mar 23, 2022, 6:48 am IST
ఉత్తరాఖండ్

పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్,హర్యానా ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ హాజరు కానున్నారు.
Mar 23, 2022, 6:35 am IST
ఉత్తరాఖండ్

ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఇవ్వాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఈ బాధ్యతలను చేపట్టడం వరుసగా ఇది రెండోసారి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+