ఉత్తర కాశీలో వరదలు.. 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు..!

దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లా ధరాలీ వరదల్లో హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న జేసీఓ సహా మొత్తం 11 మంది జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర కాశీలో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి.

దేవ భూమిగా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఉత్తర కాశీ జిల్లాలో ధరాలీ గ్రామంలో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు వ్యాప్తి చెందాయి. ఈ ఘటనలో నీటి ప్రవాహానికి వందల ఇళ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 60 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వరదల ధాటికి ధరాలీలోని హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న జేసీఓ సహా మొత్తం 11 మంది జవాన్లు గల్లంతు అయినట్లు సమాచారం.

Uttarkashi Devastated by Flash Floods 10 Army Jawans Missing in Chaos

మరోవైపు.. వరద తీవ్రత ప్రాంతాల వద్ద ఆర్మీ అధికారులు, విపత్తు నిర్వాహణ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్మీ సేన 20 మంది పౌరులను కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గాయపడ్డ వాళ్లు ప్రస్తుతం హర్షిల్‌ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ధరాలీలో NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+