Viral Video: ఆన్ లైన్ లో ఆండ్రాయిడ్ డివైజ్ ఆర్డర్ చేస్తే ఆవుపేడ వచ్చింది..!
ఇటీవలికాలంలో ఆన్ లైన్ లో ఆర్డర్లు పెట్టడం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాలైన ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ లాంటి వాటిల్లో స్టోరీస్ ను స్క్రోలింగ్ చేస్తున్న సమయంలోనూ ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ నౌ అంటూ అనేక లింక్స్ ప్రత్యక్షమవుతుంటాయి. సోషల్ మీడియా ఇటీవలి కాలంలో పెరిగి పోయిన నేపథ్యంలో ఇలాంటి ఫేక్ ఆర్డర్ యాప్స్ కూడా విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ఇక ఆన్ లైన్ లో ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి ఆర్డర్ రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు నిత్యం నెట్టింట అనేకం కనిపిస్తుంటాయి. కొన్ని సార్లు మనం పెట్టిన ప్రొడక్ట్ లోనే ఫేక్, నాసిరకం ప్రొడక్ట్స్ ను పంపిస్తున్నారు. మరి కొన్ని అయితే మనం ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే వాళ్లు వేరే ప్రొడక్ట్ పంపించేస్తున్నారు. అయితే ఇలాంటి షాకింగ్ ఘటన ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది.
A huge scam has surfaced in online delivery. This person ordered an Android device for Rs 1999 and was sent cow dung inside the package.
— Wallah Habebe (@Wallahhabebe) September 8, 2026
Always think before ordering anything online, a lot of fraud is happening, this case is from Noida. pic.twitter.com/l4QKzfBTS7
ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఆండ్రాయిడ్ డివైజ్ ఆర్డర్ పెట్టాడు. రూ. 1,999 నగదు పే చేశాడు. అయితే డెలివరీ వచ్చింది. తీరా ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఆ ప్యాకెట్ లో ఆండ్రాయిడ్ డివైజ్ లేదు. ఆవు పేడ ఉంది. ఇది చూసిన కస్టమర్ షాక్ కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్ స్టా గ్రామ్ ద్వారా తాను ఆండ్రాయిడ్ డివైజ్ ను ఆర్డర్ పెట్టానని బాధితుడు ఆకాశ్ నాగర్ తెలిపాడు. ఆన్ లైన్ లోనే ఫుల్ పే మెంట్ చేశానని అన్నాడు. ఇక సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్యాకేజీ డెలివరీ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే అందులో ఆవు పేడ ఉంది. ఆండ్రాయిడ్ డివైజ్ లేదు.

వెంటనే ఆ ఆర్డర్ ను తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు నాగర్. ఆన్ లైన్ షాపింగ్ వల్ల తాను చీటింగ్ కు గురైనట్లు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. బుకింగ్, పేమెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications
