వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vaccine: ప్రధాని, సీఎంకు షాక్, రూ. 100 కోట్లు రెఢీ, ప్రజలకు మేమే వ్యాక్సిన్ ఇస్తాం, గ్నీన్ సిగ్నల్ ఇస్తారా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనాను అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో కూడా ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు నేరుగా అందడానికి ఈ ప్రభుత్వాలకు చేతకాలేదని, అందుకే మేము రూ. 100 కోట్ల నిధులు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు నేరుగా అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కావాలని, ఆ అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని, సీఎంను ఇరకాటంలో పెట్టేశారు.

Hospital: కోవిడ్ పాజిటివ్, ఆంటీని రేప్ చేసిన నర్సు, 24 గంటల్లో మృతి, సీక్రెట్ గా మొత్తం చెప్పి !Hospital: కోవిడ్ పాజిటివ్, ఆంటీని రేప్ చేసిన నర్సు, 24 గంటల్లో మృతి, సీక్రెట్ గా మొత్తం చెప్పి !

 పేరు వింటేనే హడల్

పేరు వింటేనే హడల్

భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న సందర్బంగా భారతదేశంలో 90 శాతం లాక్ డౌన్ అమలులోకి వచ్చేసింది. కర్ణాటకలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు పెరిగిపోయింది. గత వారం రోజుల నుంచి కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. ఐటీ హబ్ పేరు చెబితే కరోనా వైరస్ భయంతో ప్రజలు హడలిపోతున్నారు.

 కాంగ్రెస్ లీడర్స్ ఎంట్రీ

కాంగ్రెస్ లీడర్స్ ఎంట్రీ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు, ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ బీజేపీ నాయకులను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించారు. ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాల మీద విరుచుకుపడ్డారు. కోవిడ్ వ్యాక్సిన్ సరైన సమయంలో ప్రజలకు అందకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ అందకపోవడంతో అమాయకులైన ప్రజలు గాలిలో కలిసిపోతున్నాయని సిద్దరామయ్య, డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.

 మేమే రూ. 100 కోట్లు ఇస్తాం.... ఓకేనా

మేమే రూ. 100 కోట్లు ఇస్తాం.... ఓకేనా

ప్రజలకు సరైన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ అవసరం, ఆ వ్యాక్సిన్ నేరుగా ప్రజలకు అందించడానికి తమ వంతుగా రూ. 100 కోట్లు ఇస్తామని సిద్దరామయ్య, డీకే. శివకుమార్ మీడియా ద్వారా కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పరు చెప్పారు. మేము రూ. 100 కోట్లతో కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేసి ప్రజలకు నేరుగా కోవిడ్ వ్యాక్సిన్ వేసి వారి ప్రాణాలు కాపాడాటానికి ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ఇనుమతి ఇవ్వాలని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మనవి చేశారు.

 ప్రధాని, సీఎం కు చెక్ పెట్టాలని ?

ప్రధాని, సీఎం కు చెక్ పెట్టాలని ?

కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీల నియోజక వర్గాల అభివృద్ది కోసం ప్రభుత్వం కేటాయించే నిధుల్లో రూ. 100 కోట్లు తాము కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చెయ్యడానికి కేటాయిస్తామని సిద్దరామయ్య, డీకే. శివకుమార్ చెప్పారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ నేరుగా కొనుగోలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కచ్చితంగా కావాలని, ఆ అనుమతి ఇస్తే కోవిడ్ వ్యాక్సిన్ ను నేరుగా ప్రజలకు అందించడానికి మేము చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య, డీకే, శివకుమార్ చెప్పారు.

Recommended Video

5% GST: Sputnik V Vaccine ప్రాణాలు నిలిపే వ్యాక్సిన్‌పై కూడా... Price ₹ 948 + GST
 చేతకాని ప్రభుత్వాలు

చేతకాని ప్రభుత్వాలు

ఈ చేతకాని ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో విఫలం అవుతున్నాయని, అందుకే ప్రతిపక్షంలో ఉంటున్న మేము ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్దరామయ్య, డీకే. శివకుమార్ బీజేపీ ప్రభుత్వాల మీద విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ లో కూడా బీజేపీ ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ ఇలా ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

English summary
Vaccine: Karnataka Congress announced, it has prepared a Rs 100 cr plan to procure vaccines directly from vaccine manufactures and administer them to the people of Karnataka. Announced by DK Shivakumar and Siddaramaiah in press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X