రైల్వే ట్రాక్‌పై రాళ్లు, ఇనుప రాడ్లు: లోకో పైలట్ అప్రమత్తతో ‘వందేభారత్’కు తప్పిన పెనుముప్పు

జైపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్లపై మొదట్నుంచి రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసింది. తాజాగా, దుండగులు ఓ వందేభారత్ రైలుకు పెను ప్రమాదాన్ని తలబెట్టారు. అయితే, వందేభారత్ రైలు లోకో పైలట్ అప్రమత్తతో ఆ పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లను గుర్తించిన లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో వేలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 7.50 గంటలకు ఉదయ్‌పూర్ నుంచి జైపూర్‌కు వందేభారత్ రైలు బయల్దేరింది. ఉదయం 9.55 గంటల సమయంలో రైలు భిల్వాడా సమీపంలో రాగానే రైల్వే ట్రాక్‌పై రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.

Vande Bharat Loco pilot Averts Accident By Applying Brakes On Seeing Stones, Rods On Tracks

ఆ తర్వాత కిందకు దిగి రైలు పట్టాలను పరీక్షించగా.. రాళ్లతోపాటు ఇనుపరాడ్లు ఉండటం చూసి షాకయ్యారు. కొన్ని చోట్ల రాళ్లు కదలకుండా ఇనుపరాడ్లు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిందా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, వందేభారత్ రైళ్లు మొదలైన నాటి నుంచి వాటిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వుతూ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+