వరవరరావు ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారు, లొంగిపోవాలి: ఎన్ఐఏ
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్‌ల సంబంధాల కేసులో నిందితుడిగా ఉన్న విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారని, అతను జైలు అధికారుల ముందు లొంగిపోవాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలిపింది.
83 ఏళ్ల వరవరరావుకు డిసెంబర్ నెల ప్రారంభంలో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లోని వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించిందని, ప్రస్తుతం వరవరరావుకు నిరంతర వైద్య సహాయం లేదా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని తీవ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది సందేశ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు నితిన్ జామ్దార్, ఎస్వీ కొత్వాల్‌లతో కూడిన ధర్మాసనానికి ఈ మేరకు తెలిపారు.
మెడికల్ బెయిల్ మంజూరు కావడానికి ముందు, వరవరరావు నవీ ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు. 'అతని(వరవరరావు) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ కోర్టు అతనికి మెడికల్ బెయిల్ ద్వారా మంజూరు చేసిన సమయం ఇప్పటికే ముగిసింది. కాబట్టి అతను ఇప్పుడే లొంగిపోవాలి. మిగిలిన అన్ని సమస్యలను (వరవరరావు తరపు న్యాయవాదులు లేవనెత్తారు) ఆ తర్వాత పరిశీలించవచ్చు' అని పాటిల్ కోర్టుకు చెప్పారు.

జస్టిస్ ఎస్‌ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో వరవరరావుకు ఆరు నెలల పాటు మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. కాగా, అతను ఈ ఏడాది సెప్టెంబరు 5న లొంగిపోవాల్సి ఉంది, అయితే అతని తదుపరి వైద్య సంరక్షణ, అతనికి వైద్య పరీక్షలు చేయించడానికి ఎన్ఐఏ కోరిన సమయం, ఇతర కారణాలతో హైకోర్టు అతని లొంగిపోయే సమయాన్ని చాలాసార్లు పొడిగించింది.
వరవరరావు తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ శుక్రవారం ధర్మాసనానికి విన్నవిస్తూ.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై నానావతి ఆసుపత్రి అభిప్రాయాన్ని ఎన్ఐఏ సమర్పించినప్పటికీ, ఎటువంటి వైద్య నివేదికల ద్వారా దానికి మద్దతు లేదని చెప్పారు.
కవి ఒరిజినల్ మెడికల్ రిపోర్టుల కోసం పట్టుబట్టకుండా ఆసుపత్రి అధికారుల ఇలాంటి నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం అంగీకరించకవద్దని ఆయన అన్నారు.
ఎన్ఐఏ సమర్పించిన నివేదికపై నానావతి ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు సంతకాలు చేశారు. ఈ సంవత్సరం డిసెంబరు 1న ఆసుపత్రిలో వరవరరావు ఆరోగ్య పరిస్థితిని "మల్టిపుల్ కన్సల్టెంట్స్" విశ్లేషించారు.
'ప్రస్తుతం వరవరరావుకు నిద్ర లేకపోవడం, కొంచెం అలసట వంటి చిన్న లక్షణాలు ఉన్నాయి. అతని ముఖ్యమైన పారామితులు సాధారణ పరిధిలో ఉన్నాయి. మిగిలిన క్లినికల్ పరీక్షలో ఎటువంటి ముఖ్యమైన అసాధారణతలు లేవు' అని ఎన్ఏఐ పేర్కొంది. వరవరరావు రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉందని, అతనికి అవసరమైన మందులు సూచించబడ్డాయని తెలిపింది.
కాగా, నానావతి ఆస్పత్రి డిసెంబర్ 20లోగా వరవరరావు ఒరిజినల్ మెడికల్ రిపోర్టులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. "సోమవారం ఒరిజినల్ మెడికల్ రిపోర్టులను సమర్పించమని ఆసుపత్రిని అడగండి. పరిష్కరించాల్సిన అవసరం ఏదైనా ఉందని మేము కనుగొంటే, మేము పార్టీల వాదనలను వింటాము" అని హైకోర్టు ఎన్ఐఏకి తెలిపింది. అప్పటి వరకు వరవరరావు లొంగిపోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications