లలిత్ మోడీ ట్వీట్, ఆంటీ సోనియా: మండిపడ్డ వరుణ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ మరో బాంబు పేల్చారు. బీజేపీ నేత వరుణ్ గాంధీని వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి పరిస్థితిని చక్కబెడతానని తనకు సహాయం చేయచూపారని లలిత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వరుణ్ గాంధీ లండన్‌లో తనను కలిసి సోనియా గాంధీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని మోడీ ఆరోపించాడు. లండన్‌లో తన ఇంట్లోనే వరుణ్‌ను కలిశారని అన్నారు. దీనిపై బిజెపి ఎంపీ వరుణ్ తీవ్రంగా ఖండించారు.
మోడీ ఆరోపణలు అవాస్తవాలే కాకుండా పనికిమాలినవని కొట్టిపారేశారు. వరుణ్ గాంధీ కొన్నేళ్ల క్రితం లండన్‌లోని తన నివాసానికి వచ్చారని, ఐపిఎల్‌తో నాకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని, ఆంటీ సోనియాతో మాట్లాడతానని వరుణ్ చెప్పారని లలిత్ మోడీ పేర్కొన్నారు.

ఇద్దరికి తెలిసిన ఓ మిత్రుడు వరుణ్‌ను తనకు పరిచయం చేశాడని ట్వీట్ చేసిన మోడీ ... ఆంటీ సోనియా ఆరు కోట్ల డాలర్లు అడిగినట్టు తనతో అన్నారని అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగించడానికి మోడీ ఆరోపణలు చేస్తున్నారని వరుణ్ ధ్వజమెత్తారు.
బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ కూడా స్పందించారు. వరుణ్ గాంధీ, సోనియా గాంధీ ఒకే కుటుంబానికి చెందినవారైనప్పటికీ పార్టీలు వేరని స్పష్టం చేశారు. కాగా తన వ్యాఖ్యలను లలిత్ మోడీ మరో ట్విట్టర్‌లో సమర్థించుకున్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications