గాడిదకు జాతీయ హోదా, గేదలు, లవర్స్ కు ప్యాకేజీలు: ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు !
బెంగళూరు: కన్నడ పోరాట నాయకుడు, వాటల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజు ఏమి చేసినా విచిత్రంగానే ఉంటుంది. ఆయన ఆందోళనలు చేసినా, కావేరీ నీటికోసం పోరాటం చేసినా, ధరలు పెరుగుదలను వ్యతిరేకించినా, ఇతర బాష సినిమాలు విడుదల కాకూడదు అని డిమాండ్ చేసినా గేదలు, గాడిదలను వెంట తీసుకెళ్లి చిత్రవిచిత్రంగానే నిరసనలు వ్యక్తం చేస్తారు. వాటల్ నాగరాజ్ వాటల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి అందర్నీ షాక్ కు గురి చేశారు.

ఎన్నికల్లో పోటీ
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో వాటల్ నాగరాజ్ పోటీ చేస్తున్నారు. చామరాజనగర నియోజక వర్గం నుంచి వాటల్ నాగరాజ్ బరిలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల సందర్బంగా ఇప్పటికే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసి హామీలు గుప్పించారు.

వాటల్ పార్టీ మేనిఫెస్టో
బుధవారం వాటల్ నాగరాజ్ ఆయన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని పార్టీల లాగే వాటల్ నాగరాజ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు. వాటల్ నాగరాజ్ మేనిఫెస్టో చూసిన ప్రజలకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది.

గాడిదకు జాతీయ హోదా
తాము అధికారంలోకి వస్తే గాడిదకు జాతీయ హోదా ప్రకటిస్తామని వాటల్ నాగరాజ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా గాడుదల అభివృద్ది కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని వాటల్ నాగరాజ్ ప్రకటించారు.

ప్రేమికులకు ప్యాకేజీలు
ప్రేమికుల రోజు వారికి మద్దతు ప్రకటించడం వాటల్ నాగరాజ్ కు అనవాయితి. ఇప్పుడు ప్రేమికులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ప్రేమికుల రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తామని, ప్రేమ వివాహాలు చేసుకునే వారికి రూ. 50 వేలు ప్రోత్సాహక నగదు ఇస్తామని వాటల్ నాటరాజ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.

గేదల అభివృద్ది పథకం
గేదలు (ఎనుములు) అభివృద్ది కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని వాటల్ నాగరాజ్ హామీ ఇచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట మీద కన్నడ జెండా ఎగరవేస్తామని వాటల్ నాగరాజ్ అన్నారు. హెల్మెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని ప్రభుత్వం పెట్టిన నియమాలు ఎత్తివేస్తాని చెప్పారు. ఇలా చిత్రవిచిత్ర పథకాలతో వాటల్ నాగరాజ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications