Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ వీడియో: మహిళా మంత్రిపై దాడి.. మెడ, చేతికి తీవ్ర గాయాలు..!

కేరళలో షాకింగ్ ఘటన జరిగింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పై దాడి జరిగింది. కేరళ స్టూడెంట్స్ యూనియన్(KSU) నల్ల జెండాల ప్రదర్శన పేరుతో జరిపిన ఆందోళనల్లో మహిళా మంత్రి వీణా జార్జ్ మెడ, చేతికి గాయాలైనట్లు తెలుస్తోంది. కన్నూర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు ఫిబ్రవరి 25 న ఆమె కన్నూర్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. టికెట్ కౌంటర్ వద్ద ఈ దాడి జరిగింది. విద్యార్థి సంఘాలు జరిపిన ఈ ఆందోళనల్లో ఆమెకు గాయాలయ్యాయి. అయితే వెంటనే మంత్రి వీణా జార్జ్ ను కన్నూర్ లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆమె ప్రయాణం రద్దు అయింది.

అయితే ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కన్నూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్య నిర్లక్ష్య ఘటనలపై నిరసిస్తూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU)కు చెందిన విద్యార్థులు నల్ల జెండాలతో ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వీణా జార్జ్ పై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది.

VeenaGeorge Attack kannur Kerala Minister Targeted Attempted Murder Case Filed vs 5 Students

ఇక ఈ ఘటన నేపథ్యంలో కన్నూర్ టౌన్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు KSU కు చెందిన ఐదుగురు విద్యార్థి నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో KSU జిల్లా అధ్యక్షుడు ఎంసీ అతుల్, జిల్లా ట్రెజరర్ అక్షయ్ మట్టూల్, సీహెచ్ ముబాజ్, బితుల్ బాలన్, మహమ్మద్ యాసిన్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మంత్రి వీణా జార్జ్ కన్నూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+