విభజనకు కట్టుబడే ఉన్నాం: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు తమ పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర బిజెపి నేతలు సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా కాంగ్రెసు, కేంద్ర ప్రభుత్వం తాము చేసిన పొరపాటును గుర్తించాలని ఆయన సూచించారు. విభజన ముసాయిదా బిల్లుపై తెలంగాణ ప్రాంత ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.

అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించి రాష్ట్ర విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశఆరు. విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా రూపొందించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిలో మార్పు లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలకు కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ బిజెపి సీమాంధ్ర నేతలు సోమవారం ఉదయం జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఈ ధర్నాలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications