హఠాత్తుగా ఆఫీస్‌కు వచ్చి చెక్ చేసిన వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం నాడు ఐబీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హఠాత్తుగా తనిఖీలు నిర్వహించి, అందరికీ షాకిచ్చారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వచ్చిన వెంకయ్య... ఎవరు ఏ సమయానికి వస్తున్నారు, ఎవరు రావడం లేదో చూసుకున్నారు.

అలాగే, కార్యాలయంలో పరిశుభ్రత ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించారు. సమయానికి రాని అధికారుల నుంచి వివరణ కోరారు. వెంకయ్యతో పాటు ఆ శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా తనిఖీలు నిర్వహించారు.
మంత్రులు స్వయంగా పలువురు అధికారులు, వారి సహాయక సిబ్బంది గదులను చూశారు. ఆఫీసులో బాత్రూంలు ఎలా ఉన్నాయో కూడా తనిఖీ చేశారు. వివిధ గదులు కారిడార్లలో కరెంట్ స్విచ్చులు ఎలా ఉన్నాయో చూసి తెలుసుకున్నారు. శాస్త్రి భవన్లో ఉదయం గం.9.30 లకు తనిఖీ చేశానని వెంకయ్య ట్విట్టర్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications