వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ స్కాం తీర్పు: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ట్విస్ట్, దినకరన్ కు రివర్స్, డీఎంకే !

|
Google Oneindia TeluguNews

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

చెన్నై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్కాం కేసులో డీఎంకే పార్టీకి చెందిన రాజా, డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళిలతో సహ కేసులోని 14 మందిని నిర్దోషులుగా విడుదల చెయ్యడంతో డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డీఎకేం పార్టీ నాయకులు నిర్దోషులుగా బయటకు రావడంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నిక కొత్త మలుపు తిరిగింది.

డీఎంకే జోష్

డీఎంకే జోష్

డీఎంకే నాయకులు అవినీతికి పాల్పడలేదని కోర్టు తీర్పు చెప్పడంతో ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు కోసం టీవీలకు అతుక్కుపోయారు. ఇప్పుడు సంతోషంగా ఓట్లు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కడుతున్నారు.

దినకరన్ కు రివర్స్ ?

దినకరన్ కు రివర్స్ ?

డీఎంకే నాయులు 2జీ స్కాం కేసులో చిక్కుకోవడంతో కొందరు డీఎంకే పార్టీ కార్యకర్తలు అన్నాడీఎంకే పార్టీకి ఓట్లు వెయ్యడం ఇష్టంలేక టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని భావించారు. అయితే రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళి నిర్దోషులుగా విడుదల కావడంతో టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని నిర్ణయించిన వారు ఇప్పుడు రివర్స్ అవుతున్నారని తెలిసింది.

 కరుణానిధి పంతం !

కరుణానిధి పంతం !

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా అధికారంలోకి వచ్చిన రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకే పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. డీఎంకే పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుకూలమైన మంత్రిత్వ శాఖలను కరుణానిధి పంతంపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు.

మూడు కేసులు

మూడు కేసులు

రూ. 1.76 లక్షల భారీ మొత్తం కుంభకోణం కావడంతో సీబీఐ రెండు కేసులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళితో సహ 14 మంది చిక్కుకున్నారు.

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది

తన సోదరితో పాటు మా పార్టీ నాయకులు ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని వెలుగు చూసిందని, న్యాయం గెలిచిందని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ అన్నారు. కోర్టు తీర్పు అనంతరం స్టాలిన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. మా పార్టీ నాయకులు ఎప్పుడూ ఎలాంటి కుంభకోణాలు పాల్పడలేదని, ప్రజల కోసమే సేవ చేస్తున్నామని స్టాలిన్ చెప్పారు. డీఎంకే పార్టీ కార్యకర్తలకు స్టాలిన్ స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు.

English summary
Verdict on 2G scam cases pronounced, all acquitted. DMK in celebration mode. DMK Working President MK Stalin gave sweets to cadres for Delhi CBI court acquits all the convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X