‘బిజెపిలో దిగ్విజయ్’: ఆదిత్యనాథ్‌పై అనుపంఖేర్ ఫైర్
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ ఎంపి ఆదిత్యనాథ్‌పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపం ఖేర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షారుక్‌పై ఆదిత్యనాథ్‌పై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.
‘షారుక్ ఖాన్ అసలైన భారతీయుడు. అతడు భారత్‌ను ప్రేమిస్తాడు. అతడ్ని భారతీయులు ప్రేమిస్తారు' అని అనుపం ఖేర్ అన్నారు. ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలు నీచమైనవి, దురదృకరమని చెప్పారు. ఆదిత్యనాథ్ బిజెపికి చెందిన దిగ్విజయ్ సింగ్‌లా మారారని అన్నారు.

అంతకుముందు, షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎంపి ఆదిత్యనాథ్.. జెయూడీ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో షారున్ పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షారుక్, సయీద్‌లు ఒకే భాషలో మాట్లాడతారని అన్నారు.
పాకిస్థాన్ నుంచి ఆహ్వానం వస్తే అతను తప్పకుండా వెళ్తాడని ఎంపి అన్నారు. భారతదేశంలో అసహనం కాదు, తీవ్ర అసహనం నెలకొందని, తాను కూడా అవార్డులు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని షారుక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆదిత్యనాథ్ పై వ్యాఖ్యలు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications