తమిళనాడు సీపీఐ వెటరన్ పాండియన్ కన్నుమూత -రాజీవ్ గాంధీ హత్య సమయంలో స్టేజీపై..
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ఓ కమ్యూనిస్టు యోధుడిని కోల్పోయింది. సీపీఐ సీనియర్ నేత డీ పాండియన్ (89) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ, చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన గురువారం కన్నుమూశారు. పాండియన్‌కు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. పాండియన్ మృతిపై సీపీఐ, సీపీఎం సహా పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. స్వగ్రామం వెల్లాయ్‌మలయ్‌పట్టిలో పాండియన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పాండియన్.. 1953లో కాలేజీ రోజుల్లోనే విద్యార్థి నేతగా పనిచేశారు. ఉద్యమాల్లో పాల్గొంటూనే చదువు కొనసాగించి, ఇంగ్లీష్ టీచర్ గా ప్రభుత్వం ఉద్యోగం కూడా సంపాదించారు. కానీ, తర్వాతి కాలంలో ఉద్యోగం వదిలేసి, పూర్తిస్థాయిలో క్రియాశీలరాజకీయాలకు పరిమితం అయ్యారు. 1989లో, 1991లో రెండుసార్లు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.

తమిళనాడులోని పెరంబదూర్ లో 1991లో రాజీవ్‌గాంధీ హత్య జరిగిన సమయంలో పాండియన్ ఆ స్టేజీ మీదనే ఉన్నాడు. రాజీవ్ ప్రసంగాన్ని తమిళంలోకి అనువాదం చేస్తూ మరో పోడియం ముందు నిలబడి ఉన్న పాండియన్.. నాటి పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో పాండియన్ కూడా చనిపోయారని కోయంబత్తూర్ అధికారులు ప్రకటించారు. కానీ, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలుసుకుని మృతుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications