గేయ రచయిత గుల్జార్‌కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ హిందీ చిత్ర గేయ రచయిత గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను చలన చిత్రరంగంలోని అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. సామాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి గుల్జార్ అసల ు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన గేయ రచయిత మాత్రమే కాకుండా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, కవి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న 45వ ప్రజ్ఞాశాలి గుల్జార్.
సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా గుల్జార్‌ను అభినందించారు. స్వాతంత్ర్య పూర్వ పంజాబ్‌లో ఆయన 1934లో జన్మించారు. తన కెరీర్‌ను 1956లో ప్రారంభించారు. విమల్ రాయ్ బందిని సినిమాతో గుల్జార్‌కు బ్రేక్ వచ్చింది.

ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు సచిన్ దేవ్ బర్మన్, సాహిల్ చౌధురి, శంకర్ - జైకిషన్, హేమంత్ కుమార్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, మదన్ మోహన్, రాజేష్ రోషన్, అను మాలిక్‌లతో కలిసి పనిచేశారు. న్యూఏజ్ శంకర్ -ఎహసాన్‌తో కూడా ఆయన పనిచేశారు.
గుల్జార్ కూతురు మేఘ్నా అవార్డు లభించిన సమాచారం అందిన వెంటనే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. తన తండ్రికి దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు లభించిందని, చాలా గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.
గుల్జార్ మేరే అప్నే, కోశిష్, ఆంధీ, కినారా, ఖుష్బూ, అంగూర్, మీరా, లేకిన్, మ్యాచిస్ సినిమాలకు దర్శకత్వం వహించారు. దూరదర్సన్ సీరియల్స్‌కు కూడా ఆయన పాటలు రాశారు. ఆయనకు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 2004లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయన మూడు కవితా సంకలనాలు వెలువడ్డాయి. రావీ పార్, ధౌన్ పేర కథా సంకలనాలు కూడా ప్రచురితమయ్యాయి.












Click it and Unblock the Notifications