టాప్ కమేడియన్ కన్నుమూత- విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ

చెన్నై: ప్రముఖ నటుడు, కమేడియన్, దర్శకుడు మనోబాల కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఆయనకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉన్నారు. కొంతకాలంగా మనోబాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటోన్నారు. కొద్దిరోజులుగా చెన్నైలోని నివాసంలోనే ఆయనకు చికిత్సను అందిస్తోన్నారు డాక్టర్లు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు.

ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మనోబాల మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది. మనోబాల మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, యువజన వ్యవహారాల శాఖ మంత్రి, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్.. సంతాపం తెలిపారు. ఆయన ఇక లేరనే వార్త తమను కలచివేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

manobala

35 సంవత్సరాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో కొనసాగారాయన. 700కి పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాలకు దర్శకత్వాన్ని వహించారు. 1979లో కోలీవుడ్‌లో అడుగు పెట్టారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేర్ వీరయ్యలో జడ్జి క్యారెక్టర్‌లో కనిపించారు. కాజల్ అగర్వాల్ లీడ్ క్యారెక్టర్‌లో నటించిన హార్రర్ కామెడీ మూవీ ఘోస్ట్లీ ఆయన చివరి సినిమా.

సావత్రి బయోగ్రఫీ మహానటిలో దర్శకుడు పీ పుల్లయ్య పాత్రను పోషించారు మనోబాల. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ ఉంది. దర్శకుడిగా, నిర్మాతగా బీజీగా ఉన్న సమయంలోనే నటుడిగా అరంగేట్రం చేశారు. 2000 ప్రారంభంలో కమేడియన్‌గా స్థిరపడ్డారు. పితామగన్, చంద్రముఖి, యారది ని మోహిని, తమిళ్‌పదం, అలెక్స్ పాండియన్, ఆరన్‌మనై సినిమాల్లో తనదైన శైలిలో కామెడీని పండించారు.

సుందర్ సీ దర్శకత్వంలో వచ్చిన ఆరన్‌మనై తెలుగు వెర్షన్- చంద్రలేఖ, కళావతి, అంతఃపురంలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. మనోబాల మృతి పట్ల తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+