హిందువుల కోసం VHP హెల్ప్ లైన్ లు-జిహాదీ దాడుల నుంచి రక్షించేందుకు ..
దేశవ్యాప్తంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రతీ ఒక్కరినీ ఆందోళనలోకి నెడుతున్నాయి. మతాల ఆధారంగా కూడా దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వీహెచ్పీ కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులపై జిహాదీ దాడుల నేపథ్యంలో "జిహాదీ బెదిరింపుల నుండి హిందువులను రక్షించడానికి" విశ్వ హిందూ పరిషత్ (VHP) బజరంగ్ దళ్ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్నాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లోని 35 ప్రాంతాలకు ఈ నంబర్లు మొదట పనిచేస్తాయి. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భయాందోళనలు సృష్టించేందుకు 'జిహాదీ శక్తులు' ప్రజలను దారుణంగా చంపేస్తున్నాయని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు.
అమరావతిలో ఉమేష్ కొల్హే, ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ హత్యలు అందుకు ఉదాహరణలుగా ఆయన చూపారు. వ్యవస్థ, పోలీసులు కూడా ఈ బాధితులను ఆదుకోవడం లేదన్నారు. VHP బజరంగ్ దళ్ ఫ్రంట్ అటువంటి వారికి న్యాయ సహాయం అందేలా చూస్తుందన్నారు. వారు ప్రజలకు, వ్యవస్థకు మధ్య వారధిగా మారతారన్నారు. ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుందని వినోద్ బన్సాల్ అన్నారు.

విశ్వ హిందూ పరిషత్ భారతదేశాన్ని 44 ప్రాంతాలుగా విభజిస్తుందని, ముందుగా ఇందులో 20 ప్రాంతాల జాబితాను సిద్ధం చేసామని నేతలు చెప్పారు. కానీ ఇతర ప్రాంతాల ప్రజల నుండి కూడా కాల్స్ రావడం ప్రారంభమయ్యాయని తెలిపారు. తమకూ హెల్ప్‌లైన్‌లు కావాలని డిమాండ్ చేశారన్నారు. దీంతో తాజా జాబితాను విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో హిందువులు తమ మతం, మతపరమైన ఆచారాలను పాటిస్తున్నందుకు , నిజం మాట్లాడినందుకు బెదిరింపులకు గురయ్యారని బన్సాల్ అన్నారు. తమ మతాన్ని సమర్ధించే లేదా దానిపై దాడి చేసిన వారిని విమర్శించిన వ్యక్తులు పట్టపగలు ట్రోల్ చేస్తున్నారన్నారు. అలాగే బెదిరించారని, కొట్టారని, చిపరికి చంపారన్నాకరు హిందువులు తమ మతాన్ని ఆచరిస్తున్నారని బెదిరించే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాలని ఆయన కోరారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications