ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపే: వెంకయ్య విజయం లాంఛనమేనా?
ఉఫరాష్ట్రపతి పదవికి ఈ నెల 5వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డిఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, యూపిఏ అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. అయితే ఎన్‌డిఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు విజయం నల్లేరుపై నడకేనన
న్యూఢిల్లీ: ఉఫరాష్ట్రపతి పదవికి ఈ నెల 5వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డిఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, యూపిఏ అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. అయితే ఎన్‌డిఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
శనివారం సాయంత్రానికి భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలనుంది. పార్లమెంట్‌హల్‌లో శనివారం నాడు పోలింగ్ నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఎన్‌డిఏకు బలమెక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో యూపిఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం సాధించాల్సిందేననే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే జెడి(యూ) మహకూటమితో తెగతెంపులు చేసుకొన్నా కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణగాంధీకే ఓటు చేస్తామని ప్రకటించింది.
ఈ నెల 5వ, తేదిన ఉదయం10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సాగుతోంది. ఈ పోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకొనే ఎంపీలకు ప్రత్యేక పెన్‌ను ఉపయోగిస్తారు. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
శనివారం రాత్రి 7 గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికకు విప్ జారీ చేయడానికి రాజకీయపార్టీలకు అవకాశం లేదు.
Recommended Video

ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రెండు టర్మ్‌లు ఈ పదివిలో కొనసాగారు. ఈ నెల 10వ, తేదితో ఆయన పదవీకాలం ముగియనుంది.
ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతి పదవితో పాటు , రాజ్యసభ ఎక్స్అఫిషియో చైర్మెన్, రాజ్యసభ, లోక్‌సభలో నామినేట్ సభ్యులను ఎన్నుకొంటుంది.
లోక్‌సభ, రాజ్యసభల్లో 790 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. అయితే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే బిజెపి ఎంపీ పాశ్వాన్‌కు ఈ ఎన్నికలో ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. కోర్టు తీర్పు కారణంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు.
545 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో బిజెపికి 281 మంది సభ్యులున్నారు. ఎన్‌డిఏకు మద్దతు తెలిపే పార్టీలను కలుపుకొంటే బిజెపి బలం 338కు చేరింది. 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బిజెపి సభ్యుల బలం 56కు చేరింది.కాంగ్రెస్ పార్టీకి 59 మంది సభ్యులున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో రానున్న రోజుల్లో బిజెపి రాజ్యసభలో గణనీయంగా బలం పెంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్‌డిఏ సుమారు వందకు చేరువలో ఉంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications