Video call: భార్యకు వీడియో కాల్ చేసి ఉరి వేసుకున్న జైలు వార్డెన్, మాజీ సీఎం సొంత జిల్లాలో !
బెంగళూరు/శివమొగ్గ: బాగా చదువుకున్న యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని పోటీపరీక్షలు రాశాడు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు ఓ యువతితో అతని వివాహం జరిపించారు. భార్యతో కాపురం చేసిన భర్త ఓ కొడుక్కి తండ్రి అయ్యాడు. ఇదే సమయంలో పోలీసు శాఖలో ఆ యువకుడికి ఉద్యోగం వచ్చింది. జైలు వార్డెన్ గా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగానికి వెళ్లిన ఆ జైలు వార్డున్ ఎప్పటి లాగా సాటి ఉద్యోగులతో సక్రమంగా మాట్లాడలేదు. తరువాత భార్యకు వీడియో కాల్ చేసిన ఆ యువకుడు ఆమెతో కొంత సేపు మాట్లాడాడు. తన కొడుకును చూడాలని ఉందని భార్యకు చెప్పాడు. కొడుకును చూస్తున్న సమయంలో జైలు వార్డెన్ సెంట్రల్ జైల్లో ఉరి వేసుకున్నాడు. తన భర్త వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఉరి వేసుకోవడంతో అతని భార్య హడలిపోయి పై అధికారులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూ జైలు వార్డెన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ సంఘటన జరగడంతో హాట్ టాపిక్ అయ్యింది.

పెళ్లి చేసిన తల్లిదండ్రులు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని హుక్కేరిలో అష్వఖ్ ఆలీ తూగరి అలియాస్ అష్వఖ్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బాగా చదువుకున్న అష్వఖ్ ఆలీ ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని పోటీపరీక్షలు రాశాడు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు ఓ యువతితో అష్వక్ ఆలీకి గత ఏడాది వివాహం జరిపించారు.

జైలు వార్డెన్ గా మొదటి పోస్టింగ్
భార్యతో కాపురం చేసిన అష్వఖ్ ఆలీ ఓ కొడుక్కి తండ్రి అయ్యాడు. ఇదే సమయంలో అష్వఖ్ ఆలీకి పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా జైలు వార్డెన్ గా అష్వఖ్ ఆలీకి మొదటి పోస్టింగ్ ఇచ్చారు. భార్య, కొడుకు బెళగావిలోని పుట్టింటిలో ఉండటంతో అష్వఖ్ శివమొగ్గలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు.

భార్యకు వీడియో కాల్ చేసి ఉరి వేసుకున్నాడు
ఉద్యోగానికి వెళ్లిన జైలు వార్డున్ అష్వఖ్ ఆలీ ఎప్పటి లాగా సాటి ఉద్యోగులతో సక్రమంగా మాట్లాడలేదు. తరువాత భార్యకు వీడియో కాల్ చేసిన అష్వఖ్ ఆమెతో కొంత సేపు మాట్లాడాడు. తన కొడుకును చూడాలని ఉందని భార్యకు చెప్పాడు. కొడుకును చూస్తున్న సమయంలో జైలు వార్డెన్ అష్వఖ్ ఆలీ అదే సెంట్రల్ జైల్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.

పోలీసులు వెళ్లే టైమ్ కి ప్రాణం పోయింది
భర్త అష్వఖ్ ఆలీ వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఉరి వేసుకోవడంతో అతని భార్య హడలిపోయి పై అధికారులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే అష్వఖ్ ఆలీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూ జైలు వార్డెన్ అష్వఖ్ ఆలీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Recommended Video

కుటుంబ సమస్యలు
జైలు వార్డెన్ అష్వఖ్ ఆలీ అతని భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఆమెతో గొడవపడ్డాడని, కుటుంబ సమస్యల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లాలో ఈ సంఘటన జరగడంతో హాట్ టాపిక్ అయ్యింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications