సారీ చెప్పినా వినని మూర్ఖత్వం ఆర్కిటెక్ట్ ప్రాణం తీసింది: ట్రక్కు కిందపడి నలిగిపోయాడు(వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద జరిగిన ఓ చిన్న వివాదం ఊహించని విధంగా ఒకరి ప్రాణం తీసింది. మొదటి వివాహ వార్షికోత్సవానికి నాలుగు రోజుల ముందే అతడు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్ సోని(32) ఇండోర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. ాకగా, గురువారం అతడు విధులు ముగించుకుని కారులో ఇంటికి బయల్దేరాడు. పలాసియా పరిసర ప్రాంతంలో అతడి కారు.. స్కూటర్‌పై వెళుతున్న వికాస్ యాదవ్ అనే వాహనదారుడిని ఢీకొట్టింది. దీంతో వెంటనే కారు నిలిపివేసి కిందకు దిగిన సిద్ధార్థ్.. వికాస్‌కు క్షమాపణలు చెప్పాడు.

video: Indore Architect Crushed By Truck Days Before Anniversary

కానీ, వికాస్ వినకుండా సిద్ధార్థ్‌తో ఘర్షణకు దిగాడు. అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు సిద్ధార్థ్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వికాస్.. సిద్ధార్థ్‌ను బలంగా నెట్టివేయడంతో.. అటుగా వస్తున్న ట్రక్కు చక్రాల కిందపడి నలిగిపోయాడు. అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన మొత్తం దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వికాస్ యాదవ్ తోపాటు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరిపైనా హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు.

ఇది ఇలావుంటే, సిద్ధార్థ్ మరణం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అతని మొదటి వివాహ వార్షికోత్సవానికి నాలుగు రోజుల ముందే మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+