ఫ్లాష్‌మాబ్: కూతురు చెంప ఛెల్లుమంది(వీడియో)
తిరువనంతపురం: నడిరోడ్డుపై ప్లాష్ మాబ్ డ్యాన్స్ చేస్తున్న ఓ కూతురి చెంప చెల్లుమనిపిచింది ఆమె తల్లి. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని పయ్యనూరు బస్టాండ్ ప్రాంతంలో కొంతమంది కాలేజీ విద్యార్థులు కలిసి హుషారుగా ప్లాష్ మాబ్ డ్యాన్స్ చేస్తున్నారు.
ఈ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామైంది. ఇంతలో ఓ మహిళ వచ్చి గుంపులో ఉన్న ఓ అమ్మాయి చెంపపై లాగి కొట్టారు. దీంతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. వెంటనే అక్కడున్న కొందరు కలగజేస్తున్నారు.
వారు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వినకుండా వెంటనే ఇంటికి రావాలని కూతురును హెచ్చరించారు. ప్లాష్ మాబ్ డ్యాన్స్ నచ్చనందునే కూతురిని అలా కొట్టినట్లు తెలుస్తోంది. తన కూతురు కాలేజీకి వెళ్లి చక్కగా చదువుకుంటోందనుకుంటే ఇలా వీధుల్లో చిందులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications