ఉగ్రవాదుల కాల్పుల వీడియో వైరల్.. కాళ్లు పట్టుకున్న వదల్లేదు కదరా..!

దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌, ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడే ప్రశాంత లోయ, ఒక్కసారిగా భీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేస్తోంది.

ఆనందం కోసం వచ్చిన వారి కలలు క్షణాల్లో చెదిరిపోయాయి. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, భవిష్యత్తు అంధకారంలోకి నెట్టింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు తన భార్య, కుమారుడితో కలిసి వెళ్లిన విహారయాత్ర విషాదంగా ముగిసింది. భార్య కళ్ల ముందే భర్త తుపాకీ గుళ్లకు బలవడం అత్యంత హృదయ విదారకమైన సంఘటన. పెళ్లైన ఆరు రోజులకే భర్త తన కళ్లెదుట తుపాకీ గుళ్లకు బలి కావడం ఆ యువతిని శోకసంద్రంలోకి నెట్టింది.ఓ చిన్నారి తన తండ్రిని కోల్పోవడం, ఆ తల్లి తన జీవిత భాగస్వామిని శాశ్వతంగా దూరం చేసుకోవడం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. తాజాగా ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

Video of Pahalgam terrorist attack in Kashmir goes viral

ఈ వీడియోలో ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరపడం కనిపించింది. భయంతో కొందరు చెట్ల చాటున దాక్కుని ఉండగా, మరి కొందరు ప్రాణాల కోసం పరుగులు తీయడం కనిపించింది. మొదట కాల్పులు శబ్ధం వినిపించిన వెంటనే అక్కడున్న వారంతా కూడా భయంతో పరుగులు తీస్తుంటే, అక్కడే ఉన్న ఓ వ్యక్తి అది కశ్మీర్‌లో ఇది పండుగా అని చెప్పి పర్యాటుకులను తప్పుదోవ పట్టించారని తెలుస్తోంది. ఆ వ్యక్తి కూడా ఉగ్రవాది అయి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాల్పులు జరుపుతున్న సమయంతో హిందువా , ముస్లింవా అని అడిగి మరీ చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అలాగే రెండేళ్ల పాపను చూపించి, మమ్మల్ని వదిలేయాలని కాళ్లు పట్టుకున్న వారిని వదిలి పెట్టకుండా కాల్పులు జరిపారు దుండగులు. భర్తను కాల్చి చంపడంతో ,తనని కూడా చంపాలని కోరిన మహిళను, మేము నిన్ను చంపాము.. పోయి మోదీకి చెప్పు అని చెప్పడం వారి కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచింది. దీనిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరించారు. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+