వీడియో వైరల్ : హాస్పిటల్‌లో రిషి కపూర్ చివరి క్షణాలు..కంటతడిపెట్టుకున్న ఫ్యాన్స్

సినీ ఇండస్ట్రీని వరస మరణాలు శోకసంద్రంలోకి నెట్టివేస్తున్నాయి. నిన్న ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి చెందిన కొన్ని గంటలకే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ గురువారం ఉదయం మరణించారు. క్యాన్సర్‌తో పోరాడి తుదిశ్వాస విడిచారు రిషికపూర్. ఇక రిషికపూర్ తన చివరి క్షణాల్లో కూడా చాలా ఉల్లాసంగా గడిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రిషికపూర్ నిజంగానే చాలా ఉల్లాసంగా గడిపారని చెప్పేందుకు తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

రిషికపూర్ చనిపోయేముందు హాస్పిటల్‌లో బెడ్‌పైన ఓ వ్యక్తి పాటను ఆలపిస్తుండగా చాలా ఆసక్తితో తిలకించారు రిషికపూర్. పాట పూర్తయిన తర్వాత ఆ అబ్బాయిని ఆశీర్వదించారు కూడా. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన పలువురు సినీ ప్రేమికులు రిషికపూర్ అభిమానులు కంటతడి పెడుతున్నారు. మొత్తం మీద 92 సినిమాల్లో నటించిన రిషికపూర్ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం రోజున తుది శ్వాస విడిచారు.

Video of Rishi Kapoors last minutes in hospital goes viral

ఇక రిషికపూర్ అంత్యక్రియలు చాలా సాధారణంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు సన్నిహితులు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం 20మంది మాత్రమే రిషికపూర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ముంబైలోని చందన్వాడీ స్మశానవాటికలో రిషికపూర్ అంత్యక్రియలు పూర్తి చేశారు. రిషికపూర్ అంత్యక్రియలకు భార్య నీతు, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్, రణధీర్ కపూర్, అభిషేక్ బచ్చన్‌లు హాజరయ్యారు. అంతకుముందు బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు రాజకీయనాయకులు రిషికపూర్‌కు ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+