వీడియో వైరల్ : ఒక ఆడ పులి..రెండు మగపులులు..ఒక ఫైట్ సీన్..ఇదీ స్టోరీ!
Recommended Video
ఢిల్లీ: ఇద్దరు ప్రేమికులు డీప్ లవ్‌లో మునిగి ఉండగా ప్రియురాలి సోదరుడో లేక తండ్రో వారి ప్రేమకు బ్రేక్ వేసేందుకు చూస్తారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో సర్వసాధారణం. కొన్ని సార్లు నిజజీవితంలో కూడా ఇలాంటి పరిస్థితినే చాలామంది ప్రేమికులకు ఎదురవుతూ ఉంటుంది. మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. కానీ జంతువుల్లో కూడా ప్రేమకు అడ్డు పడే సోదరుడు ఉంటారంటే నమ్ముతారా..? అవును ఇది నిజం. ఈ ఘటన ఓ అడవిలో చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
రెండు మగపులుల మధ్య పేచీ పెట్టిన ఆడపులి
రెండు పులులు... ఓ ఆడపులి మగపులి డీప్ రొమాన్స్‌లో ఉండగా మగపులి సోదరుడు సీన్‌లోకి ఎంటర్ అయి ఆ పులి మీద విరుచుకుపడ్డాడు. రెండు పులులు గొడవ పడుతుండగా ఆడపులి చిన్నగా అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఆడపులి పేరు నూర్. రెండు మగపులులకు టీ 57 మరియు టీ-58 అనే లేబుల్స్‌ను అటవీశాఖ అధికారులు ఇచ్చారు. ఈ రెండు మగపులులు సోదరభావంతో కలిసి ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే నూర్ అనే ఈ ఆడపులి టీ-57తో రొమాన్స్‌లో మునిగి ఉంది. అంతకుముందు టీ -58 అనే పులితో కూడా ప్రేమ వ్యవహారం నడిపింది. రెండు పులులు డీప్ లవ్‌లో ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి టీ-58 వచ్చింది. అంతే నా ప్రియురాలితో నువ్వు రొమాన్స్ చేస్తావా అన్నట్లుగా సోదరుడిపైకి పంజా విసిరింది. రొమాన్స్ కాస్తా వార్‌కు దారి తీసింది.

గొడవపెట్టి తుర్రున జారుకున్న ఆడపులి
ఇక రెండు పులులు గొడవకు దిగడంతో నూర్ ఎవరికి మద్దతు తెలపాలో తెలియక తుర్రున అక్కడి నుంచి జారుకుంది. ఈ రెండు పులులు భీకర పోరుకు దిగాయి. అదేదో మహారాణి కోసం చిన్నపాటి యుద్ధమే చేశాయి. నా ప్రియురాలితో నువ్వేంటి రొమాన్స్ చేసేదంటూ టీ-57 అనే పులి పంజా విసరగా మామధ్య రావడానికి నీకెంత ధైర్యం అన్నట్లుగా టీ-58 పులి విరుచుకుపడింది. మొత్తానికి రెండు పులుల మధ్య ఫైట్ సీన్ భలేగా ఉంది. ఈ రెండు పులులు గొడవపడుతున్న వీడియోను కల్నల్ డీపీకే పిల్లాయ్ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే వీడియో వైరల్ అయ్యింది.

మరో జోన్‌లో ఇంకో మగపులితో రొమాన్స్
ఇక అసలు విషయం ఏమిటంటే నూర్ అనే ఆడపులి ఈ రెండు పులులతోనే సరసాలు ఆడలేదు. రెండు పులులు గొడవపడుతుంటే అక్కడి నుంచి చిన్నగా జారుకుని మరో జోన్‌కు వెళ్లి అక్కడ కుంభా అనే టీ-34 పులితో రొమాన్స్‌కు దిగిందని కల్నల్ పిల్లాయ్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది బాలీవుడ్ సినిమా రేస్‌ను తలపించింది.ఇక ఈ వీడియో పోస్టు కాగానే నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు రాశారు. కథలో ఎన్నో ట్విస్టులున్నాయని ఒకరు కామెంట్ పోస్టు చేయగా కొందరు వేదాంతం గురించి మాట్లాడారు. మొత్తానికి ఈ పులుల స్టోరీ మనుషుల కథతో చాలా దగ్గరగా పోలి ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 12వేల మంది చూశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications