రైల్వేలో ఇలాంటి పరిస్థితా?: గొడుగు పట్టుకుని రైలు నడుపుతున్న డ్రైవర్(వీడియో)
సామాజిక కార్యకర్త, జర్నలిస్టు అయిన సుచేతా దళాల్.. ధన్‌బాధ్ లోని ఒక రైల్వే డ్రైవర్ దుస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ధన్‌బాద్: వర్షాకాలం సమీపిస్తుందంటే చాలు.. పేద, మధ్యతరగతి కుటుంబాలు అలర్ట్ అయిపోతాయి. ఇంటి పైకప్పుకు ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయో వాటిని పూడ్చే పనిని ముందేసుకుంటాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు కనిపిస్తుంది.
ఆఖరికి బస్సు పైకప్పులకు చిల్లులు పడ్డ సంఘటనలు కూడా చూసుంటాం. కానీ రైలు పైకప్పుకు చిల్లు పడటం ఎప్పుడైనా చూశారా?.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ రైల్వేలో ఇలాంటి దుస్థితి కొనసాగుతోంది. రైలు పైకప్పు సరిగా లేకపోవడంతో.. రైల్వే డ్రైవర్ ఒకరు గొడుగు పట్టుకునే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Railway safety? @sureshpprabhu and @RailMinIndia need to take a serious look without victimising whistleblower pic.twitter.com/Ue7rv0LwTP
— Sucheta Dalal (@suchetadalal) August 9, 2017
సామాజిక కార్యకర్త, జర్నలిస్టు అయిన సుచేతా దళాల్,, ఆ రైల్వే డ్రైవర్ దుస్థితిని ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ట్యాగ్ చేసి ట్విట్టర్ లో వీడియోను పోస్టు చేసింది.
కాగా, దీనిపై స్పందించిన సదరు రైల్వే డ్రైవర్.. ప్రతీ ఏడాది తనకు ఈ పరిస్థితి తప్పడం లేదని వాపోయాడు. గొడుగు పట్టుకునేది తాను తడవకుండా ఉండటానికి కాదని, కంట్రోలో పానెల్ పై నీళ్లు పడకుండా ఉండటానికి అని చెప్పారు. మరి రైల్వే మంత్రి ఇప్పటికైనా దీనికి పరిష్కారం చూపిస్తారో లేదో?..
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications