వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:మెట్రోలో చంటి పిల్లతో వివాహిత.. కింద కూర్చొని, సీటివ్వని ప్యాసెంజర్స్.. వైరల్

|
Google Oneindia TeluguNews

స్త్రీలను గౌరవించడం సంప్రదాయం. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్.. లేదంటే చంటి పిల్లలు ఉన్నవారికి రెస్పక్ట్ ఇవ్వాల్సిందే. ఆర్టీసీ బస్సులో కొన్ని సీట్లను వదిలేస్తారు. ట్రైన్.. మెట్రోలో అయితే నో.. అందరూ చక్కగా కూర్చొంటారు. చంటి పిల్లలు ఉన్నవారికి సీట్లేమీ ఉండవు. సో.. వారు అపసోపాలు పడాల్సిందే. లేదంటే కింద కూర్చొవాలి. అలా చేయడానికి కొందరికీ ధైర్యం ఉండదు. మరికొందరికీ తప్పదు. అలా ఓ వివాహిత మెట్రోలో కూర్చున్నారు. మిగతా వారు మాత్రం తమకు ప్రపంచంతో సంబంధ: లేదన్నట్టు ప్రవర్తించారు. దీనికి సంబంధించి ఒకరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు చూడండి.

డిగ్రీలు ఉన్నా..

అందులో కనిపిస్తోన్న ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఓ వివాహిత మాత్రం మెట్రోలో కింద కూర్చొన్నారు. ఆమె చేతుల్లో చిన్నారి కూడా ఉన్నారు. మిగతా వారు సీటు ఇచ్చే ధైర్యం చేయలేదు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ షేర్ చేశారు. అందులో అంతా చదువుకున్నొళ్లు ఉన్నారు. కానీ మీకు డిగ్రీలు ఉన్నాయి.. కానీ సంస్కారం మాత్రం లేదు. మంచి ప్రవర్తన లేదని ఆయన క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు.

8 లక్షల వ్యూస్

8 లక్షల వ్యూస్

ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే 8 లక్షల సార్లు జనం చూశారు. చాలా మంది లైకులు, కామెంట్ చేస్తున్నారు. అదేంటి ఆ మెట్రోలో ప్రయాణిస్తోన్న మిగతా మహిళలు కూడా సీటు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. దీంతో మానవత్వం అనేది లేదని రుజువు అయ్యిందని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి ఘటన జరిగిందని తెలిసి సిగ్గేస్తోందని మరొకరు కామెంట్ రాశారు.

 వృద్దుడికి కూడా

వృద్దుడికి కూడా

మెట్రోలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమీ ఫస్ట్ కాదు. గతంలో 2017లో ఓ వృద్దుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఎదుర్కొన్నాడు. కానీ అతను ముస్లిం కావడంతో.. సీటు ఇవ్వలేదు. ఢిల్లీ మెట్రోలో కొందరు యువత ఉండగా సీటు అడిగాడు. వారు సీటు ఇవ్వకపోగ.. దూషించారు. మతం పేరుతో మనసునొచ్చేలా మాట్లాడారు.

ఇక్కడ మీకు సీటు ఇవ్వం.. మీకు సీటు కావాలంటే పాకిస్థాన్ వెళ్లు అని దూషించారు. ఘటనకు సంబంధించి ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవిత కృష్ణన్ పోస్ట్ చేశారు.

నో కంప్లైంట్

నో కంప్లైంట్

ఇక్కడ సీటు హిందుస్థానీలకే ఉంటాయి.. మీలాంటి పాకిస్థానీలకు కాదు. మీకు సీటు కావాలంటే మాత్రం పాకిస్థాన్ వెళ్లు అని యువత అన్నారని పేర్కొన్నారు. ఆ వృద్దుడికి ఏఐసీసీటీయూ జాతీయ కార్యదర్శి సంతోష్ రాయ్ మద్దతు తెలిపారు. ఘటన ఖాన్ మార్కెట్ స్టేషన్ ఏరియాలో జరగగా.. పండర రోడ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అయితే ఆ వృద్దుడు మాత్రం ఫిర్యాదు చేయడానికి మాత్రం ఇష్టపడలేదు.

English summary
woman was carrying a baby in her arms, but not a single person bothered to give up their seat for this woman at metro.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X