జాతీయ గీతం ఆలపిస్తుంటే.. ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే..(వీడియో)
అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఆదివారం హౌరాలో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయగీతాలాపన జరుగుతుండగా మౌనంగా నిలబడాల్సిన ఎమ్మెల్య
హౌరా: జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడంలో ప్రజాప్రతినిధులు ఏ రీతిలో నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. జాతీయ గీతాన్ని గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించిన ఓ ఎమ్మెల్యేనే జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఆదివారం హౌరాలో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయగీతాలాపన జరుగుతుండగా మౌనంగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు.

కాగా, ఈ వ్యవహారం కెమెరాకు చిక్కింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ, బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరించిన జగ్‌మోహన్ దాల్మియాకు ఈమె కుమార్తె కావడం గమనార్హం.
ఇంతకుముందు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా ఇలాగే మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా, సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేస్తూ సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత.. ఇటీవల గీతాలాపన సమయంలో లేచి నిల్చోకపోవడంతో ఆరుగురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications